దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో మలయాళీ ముద్దుగుమ్మ నిత్యమీనన్ ఒకరు.ఈమె నాచురల్ స్టార్ నానితో కలిసి అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న నిత్యామీనన్ చాలా సెలెక్టెడ్ పాత్రలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇలా గ్లామర్ షో కి తావు లేకుండా అద్భుతమైన పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నిత్యామీనన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఒక వీడియోలో మాత్రం ఏకంగా నిత్యమీనన్ టీచర్ గా మారిపోయి పిల్లలకు పాఠాలు చెబుతూ కనిపించారు.
ఈమె మలయాళీ నటి అయినప్పటికీ తెలుగులో పాఠాలను చెబుతున్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.నా నూతన సంవత్సరంలోని మొదటి నెల ఇలా గడిచింది.కృష్ణాపురంలోని ఒక పాఠశాలకు వెళ్లి అక్కడ చిన్నారులతో మాట్లాడాను అయితే వారు నేర్చుకున్న దాని కన్నా వారి నుంచి నేను ఎక్కువగా నేర్చుకున్నానని,
వారితో సమయం గడిపినందుకు నా మనసు ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఈ సందర్భంగా నిత్యామీనన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.