ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు.ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ వారు ఫిర్యాదు చేశారు.
ఉద్యోగులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు.సకాలంలో జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు.
జీతాలు మొదటి తేదీనే ఇవ్వాలని ఉన్నా.ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
బడ్జెట్‌పై కంట్రోల్ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా చేయాలని చూస్తున్నారు.బకాయిల చెల్లింపులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి.
గత్యంతరం లేని పరిస్థితుల్లోనే గవర్నర్‌ను కలిశాం అని నేతలు పేర్కొన్నారు.ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ కామెంట్స్ మేము ఏదైనా నిరసన తెలుపుదాం అంటే కుదరనివ్వడం లేదు సకాలంలో జీతాలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్యోగులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు ప్రభుత్వం ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి గవర్నర్ కి వివరించడం జరిగింది జీతాలు మొదటి తేదీని ఇవ్వాలని ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు బడ్జెట్ పై కంట్రోల్ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా చేయాలని చూస్తున్నారు ఉత్తమ యాజమానిగా నిలవాల్సిన ప్రభుత్వం దానిని నుంచి తప్పుకుంటుంది మా అనుమతి లేకుండా జి పి ఎస్ ను విత్ డ్రా చేశారు 90 వేలమంది ఉద్యోగుల అనుమతి లేకుండా వారి అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నారు గవర్నర్ కి అన్ని విషయాలు వివరించాము.
గవర్నర్ సానుకూలంగా విన్నారు కొన్ని సందేహాలు కూడా గవర్నర్ వ్యక్తం ప్రభుత్వం తాను ఏర్పాటు చేసిన నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తూoది అన్ని అంశాలు పరిశీలించి న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు ఎప్రిల్ నుంచి రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయం ప్రకారం తీవ్రమైన ఆందోళన చేపడతాo రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను సమాయత్తం చేస్తాం మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు ఉద్యోగుల అకౌంట్స్ ను డబ్బులు తీశారని అడిగితే సాంకేతిక సమస్య వల్ల అలా జరిగిందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల మధ్య నాలుగు స్తంభాల ఆట నడుస్తోంది మా డబ్బులు తీసుకున్నారని మేము కేసు పెడతాని చెపితే.సాంకేతిక సమస్య వల్ల అలా జరిగిందని చెప్పారుమా డబ్బులు మాకు ఇస్తామని అంటున్నారు ఇప్పుడు కేసు పెడదామని అనుకున్న ఏ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు తీసుకునే అవకాశం లేదు
.