సిక్కు వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) పరారీలో వున్న సమయంలో భారత్‌తో పాటు పలు దేశాల్లో వున్న ఖలిస్తాన్ అనుకూలవాదులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.అంతేకాదు.
ఏకంగా భారతీయ దౌత్య కార్యాలయాలపై ఖలిస్తాన్ వేర్పాటువాదులు దాడికి దిగారు.బ్రిటన్, కెనడా, యూఎస్‌లలోని భారత రాయబార కార్యాలయాల వద్ద చోటు చేసుకున్న విధ్వంసంతో ప్రపంచమే నివ్వెరపోయింది.
తమ దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను ఏర్పాటు చేయాలని భారత్.ఆయా దేశాలను కోరింది.
నాటి ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ( National Investigation Agency ) (ఎన్ఐఏ) విచారణ నిర్వహించనుంది.దీనికంటే ముందు ఈ ఏడాది మార్చిలో లండన్‌లోని భారత హైకమీషన్ వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, విధ్వంసం కేసును కూడా ఎన్ఐఏ చేతికి అప్పగించింది కేంద్రం.
మార్చిలో జరిగిన ఈ దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం ‘‘ఉపా’’( UPA ) కింద ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేసినట్లు వెల్లడించాయి.
కాగా.ఈ ఏడాది మార్చిలో అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వేటాడుతున్న నేపథ్యంలో అతనిని అరెస్ట్ చేయొద్దంటూ ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాదులు నిరసనకు దిగారు.ఈ క్రమంలోనే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో వున్న భారత కాన్సులేట్‌పై దాడి చేయడంతో పాటు ధ్వంసం చేశారు.పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని ఛేదించుకుని, కాన్సులేట్ ప్రాంగణంలో రెండు ఖలిస్తానీ జెండాలను ఎగురవేశారు.
వెంటనే ఇద్దరు కాన్సులేట్ సిబ్బంది ఈ జెండాలను తొలగించారు.దీనిపై ఢిల్లీలోని అమెరికా ఛార్జ్ డి’ ఎఫైర్స్‌కు భారత్ తీవ్ర నిరసన తెలిపింది.
అటు కెనడాలోని భారత దౌత్య కార్యాలయాలను ఖలిస్తాన్ వాదులు లక్ష్యంగా చేసుకోవడం పట్ల భారత్‌లోని కెనడా హైకమీషనర్‌ను న్యూఢిల్లీ పిలిపించింది.
జూన్ 12న ఎన్ఐఏ లండన్‌లోని ఇండియన్ మిషన్‌పై ( Indian Mission )దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసింది.అలాగే నిందితులను గుర్తించడంలో ప్రజల సహాయాన్ని కోరింది.మార్చి 19న లండన్‌లోని హైకమీషన్ కాంప్లెక్స్ వెలుపల నిరసనలు చేస్తున్న సమయంలో ఖలిస్తానీ అనుకూల నిరసనకారులు .లోపల విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారు.అలాగే జాతీయ జెండాను కిందకి దించి అవమానకరంగా ప్రవర్తించారు.
ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్‌ను పిలిచి వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది.
అంతేకాదు.బ్రిటీష్ హైకమీషన్ కార్యాలయం వద్ద వున్న బారికేడ్లను తొలగించి ప్రతీకారం తీర్చుకుంది.