పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్( Pakistan vs New Zealand ) మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లోను పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది న్యూజిలాండ్ జట్టు.న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ వరుస సిక్సర్లతో చెలరేగి పాక్ బౌలర్లను మైదానంలో పరుగులు పెట్టించి న్యూజిలాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఫిన్ అలెన్ 16 సిక్సర్లు( Finn Allen 16 sixes ), ఐదు ఫోర్లతో రికార్డ్ సెంచరీతో రాణించడం వల్ల న్యూజిలాండ్ జట్టు 45 పరుగుల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.ఫిన్ అలెన్ 62 బంతుల్లో 137 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.48 బంతుల్లోనే ఫిన్ అలెన్ సెంచరీ చేశాడు.
టీ20ల్లో( T20s ) అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన న్యూజిలాండ్ ఆటగాడిగా ఫిన్ అలెన్ నిలిచాడు.బ్రెండన్ మెకల్లమ్( Brendon McCullum ) 123 పరుగులతో అగ్రస్థానంలో ఉండే రికార్డును ఫిన్ అలెన్ బ్రేక్ చేశాడు.అంతే కాదు టీ20ల్లో న్యూజిలాండ్ క్రికెటర్ 10 కి పైగా సిక్సర్లు కొట్టడం ఇదే తొలసారి కావడం విశేషం.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ కొట్టిన 16 సిక్సర్ల రికార్డును ఫిన్ అలెన్ సమం చేశాడు.
ఈ టీ20 సిరీస్ విషయానికి వస్తే.వరుసగా 3 టీ20 మ్యాచ్ లలో గెలిచిన న్యూజిలాండ్ జట్టు 3-0 తేడాతో లీడ్ లో ఉంది.మూడవ టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్ నాలుగు ఓవర్లకు ఏకంగా 60 పరుగులు సమర్పించుకుని అత్యంత చెత్త బౌలర్ గా నిలిచాడు.అయితే ఇతను రెండు వికెట్లు తీసుకోవడం కాస్త జట్టుకు ఊరట కల్పించింది.
పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి 45 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.