నేడు న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్..ఆఫ్ఘాన్ మరోసారి షాక్ ఇచ్చేనా..!

నేడు న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉత్కంఠ భరిత పోరు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరగనుంది.అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు గత మ్యాచ్లో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి ఫుల్ ఫామ్ లోకి వచ్చింది.

 New Zealand-afghanistan Match Today Will Afghanistan Give A Shock Once Again,-TeluguStop.com

ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )జట్టులో కాన్ఫిడెంట్ లెవెల్ మరో స్థాయికి చేరింది.ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే.

ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్లలో మంచి అద్భుత విజయాలను సాధించింది.కానీ క్రికెట్ లో పరిస్థితులు తారుమారు కావడానికి పెద్దగా సమయం పట్టదు.

ఒక చిన్న పొరపాటు మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసేస్తుంది.నేడు జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్ కు ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాక్ ఇచ్చిన పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

Telugu Afghanistan, England, Icc Cup, Zealand-Sports News క్రీడలు

ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ న్యూజిలాండ్ బ్యాటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.చిదంబరం స్టేడియం స్పిన్ బౌలింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ టోర్నీలో చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి రెండు మ్యాచ్లలో స్పిన్ బౌలింగ్ దే ఆధిపత్యం.కాబట్టి మ్యాచ్ ఆరంభం నుండి న్యూజిలాండ్ జట్టు ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉంటేనే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.

లేదంటే ఇంగ్లాండ్ ( England )ఏ విధంగా ఓడిందో అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడల్సి ఉంటుంది.

Telugu Afghanistan, England, Icc Cup, Zealand-Sports News క్రీడలు

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో( ODI World Cup ) ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు రెండుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి.ఈ రెండు సార్లు న్యూజిలాండ్ జట్టే గెలిచింది.కానీ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించలేం.

ఇక ఆఫ్గనిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ ను ఓడించడం ద్వారా ప్రపంచ కప్ లలో 14 మ్యాచ్ల ఓటముల పరంపరకు ఆఫ్ఘనిస్తాన్ స్వస్తి చెప్పింది.న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే.

ఆసియాలో పూర్తయిన చివరి ఆరు వన్డే మ్యాచ్ లలో న్యూజిలాండ్ విజయం సాధించింది.మరి నేడు జరిగే మ్యాచ్లో ఏ జట్టు పై చేయి సాధిస్తుందో.

ఏ జట్టు ఘోర ఓటమిని ఖాతాలో వేసుకుంటుందో చూసేందుకు క్రికెట్ అభిమానులు సైతం అధిక ఆసక్తితో వేచి చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube