Suma Kanakal : సంపాదిస్తున్న డబ్బు సరిపోలేదా సుమక్క…దాన్ని కూడా విసిగించాలా… సుమ వీడియో పై నెటిజన్స్ రియాక్షన్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సుమా కనకాల ( Suma Kanakal ) మాత్రమే అని చెప్పాలి ఈమె మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా సుమా కనకాలకు రోజు రోజుకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది అనే సంగతి మనకు తెలిసిందే.

 Netizens Funny Comments On Suma Iritate Dog Funny Video-TeluguStop.com

కెరియర్ మొదట్లో పలు సీరియల్స్ లో నటించినటువంటి సుమా అనతరం పలు సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించారు.అయితే యాంకర్ గా మారిన తర్వాత సీరియల్స్ సినిమాలకు కూడా దూరమయ్యారు.

వారంలో ఏడు రోజులపాటు ఏదో ఒక సినిమా ఈవెంట్ ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్ , సక్సెస్ మీట్ అంటూ వరుస సినిమా వేడుకలతో ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు.సాధారణంగా ఒక యాంకర్ అందుబాటులో లేకపోతే మరొక యాంకర్ చేత సినీ సెలబ్రిటీలు వారి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఎంతో మంది హీరోలు సుమ డేట్స్ ఎప్పుడు ఖాళీగా ఉన్నాయో తెలుసుకొని మరి వారి వేడుకను ప్లాన్ చేసుకుంటారు అంత క్రేజ్ సుమకి ఉంది అని చెప్పాలి.

ఇలా ఒక్కొక్క కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ కొన్ని లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకుని ఈమె మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి సుమ సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఈమె కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు.అలాగే ఇంస్టాగ్రామ్ ద్వారా ఎన్నో రకాల వీడియోలు అభిమానులతో పంచుకుంటూ వాటి ద్వారా కూడా భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారని చెప్పాలి.

ఇక సుమ ఇంట్లో జోరో( Zoroo ) అనే పెట్ డాగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.సుమా తరచు తన వీడియోలలో తన డాగ్ గురించి అందరికీ తెలియజేస్తూ ఉంటారు.అలాగే సరదాగా తనతో ఆడుకుంటూ ఉంటారు అయితే తాజాగా ఒక వీడియో ఈమె షేర్ చేశారు తన డాగ్ చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా సుమ మాత్రం దాన్ని విసిగిస్తూ నిద్ర లేపే ప్రయత్నం చేశారు.అయితే సుమ ఎంత విసిగించినా ఆ డాగ్ మాత్రం పైకి లేకుండా అలాగే పడుకుని ఉంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూడటానికి చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ కొంతమంది నేటిజన్స్ మాత్రం సుమ పట్ల ట్రోల్స్ చేస్తున్నారు.

ఎందుకు సుమక్క పడుకున్న దానిని డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ కొందరు కామెంట్లు చేయక దానిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు అయితే కొంతమంది మాత్రం మీరు యాంకర్ గాను యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు.ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా సంపాదన మొదలు పెట్టారా.

డబ్బు కోసం మీ రీల్స్ కోసం ఆ కుక్కని కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా సుమక్క అంటూ ఈమె పట్ల కామెంట్ చేయడంతో ఇవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube