సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి వారిలో నయనతార ( Nayanthara ) ఒకరు.సాధారణంగా హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఎక్కువ లైఫ్ ఉండదు కానీ ఈమె మాత్రం గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నారు.
సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్( Highest Remuneration ) అందుకుంటున్నటువంటి హీరోయిన్ గా కూడా నయనతార పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా నయనతార ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎంతో బిజీగానే గడుపుతున్నారని చెప్పాలి.
ఇలా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి ఈమె ఆస్తులు కూడా అదే రీతిలో కూడా పెట్టిందని తెలుస్తోంది.చెన్నైలో మాత్రమే కాకుండా కేరళ బెంగుళూరు వంటి ప్రాంతాలలో కూడా ఖరీదైన ఆస్తులను( Nayanthara Properties ) కొనుగోలు చేశారు.అలాగే ఖరీదైన కార్లను కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి కూడా ప్రైవేట్ జెట్ లేదు.కానీ నయనతార మాత్రమే ప్రైవేట్ జెట్ మైంటైన్ చేస్తూ వస్తున్నారు.
ఇలా ఈమె ఉపయోగించే ప్రతి వస్తువు కూడా చాలా ఖరీదైనది కావటం విశేషం.ఉండే ఇల్లు తిరిగే కార్లు వేసుకునే వస్తువులన్నీ కూడా చాలా ఖరీదైనవి గానే ఉంటాయి.అయితే తాజాగా ఈమె చేతికి కట్టుకున్నటువంటి వాచ్ ( Watch ) గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నయనతార రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ అనే బ్రాండ్ కి చెందినటువంటి వాచ్ ధరించారు.ఈ వాచ్ ఖరీదు సుమారు 50 లక్షల( 50 Lakhs Watch ) వరకు ఉంటుందనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నయనతార హీరోలతో పాటు సమానంగా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారంటూ ఈ విషయంపై పలువురు కామెంట్లు చేస్తున్నారు.