నయనతార కట్టిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా.. హీరోలకు ఏమాత్రం తీసిపోదుగా?
TeluguStop.com
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి వారిలో నయనతార ( Nayanthara ) ఒకరు.
సాధారణంగా హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఎక్కువ లైఫ్ ఉండదు కానీ ఈమె మాత్రం గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నారు.
సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్( Highest Remuneration ) అందుకుంటున్నటువంటి హీరోయిన్ గా కూడా నయనతార పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా నయనతార ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎంతో బిజీగానే గడుపుతున్నారని చెప్పాలి. """/"/
ఇలా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి ఈమె ఆస్తులు కూడా అదే రీతిలో కూడా పెట్టిందని తెలుస్తోంది.
చెన్నైలో మాత్రమే కాకుండా కేరళ బెంగుళూరు వంటి ప్రాంతాలలో కూడా ఖరీదైన ఆస్తులను( Nayanthara Properties ) కొనుగోలు చేశారు.
అలాగే ఖరీదైన కార్లను కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి కూడా ప్రైవేట్ జెట్ లేదు.
కానీ నయనతార మాత్రమే ప్రైవేట్ జెట్ మైంటైన్ చేస్తూ వస్తున్నారు. """/"/
ఇలా ఈమె ఉపయోగించే ప్రతి వస్తువు కూడా చాలా ఖరీదైనది కావటం విశేషం.
ఉండే ఇల్లు తిరిగే కార్లు వేసుకునే వస్తువులన్నీ కూడా చాలా ఖరీదైనవి గానే ఉంటాయి.
అయితే తాజాగా ఈమె చేతికి కట్టుకున్నటువంటి వాచ్ ( Watch ) గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నయనతార రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ అనే బ్రాండ్ కి చెందినటువంటి వాచ్ ధరించారు.
ఈ వాచ్ ఖరీదు సుమారు 50 లక్షల( 50 Lakhs Watch ) వరకు ఉంటుందనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నయనతార హీరోలతో పాటు సమానంగా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారంటూ ఈ విషయంపై పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఆపరేషన్ బ్లూ స్టార్ … నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి