Navdeep: పెళ్లిపై నిర్ణయం మార్చుకున్న నవదీప్..త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడా..?

నటుడు నవదీప్ ( Navdeep ) జై అనే మూవీ తో టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి( Gowtam SSC ) ,మొదటి సినిమా, చందమామ వంటి సినిమాల్లో హీరోగా ఆకట్టుకున్నారు.అయితే కొత్త హీరోలు వస్తున్న కొద్ది ఈయన తనలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టక అలాగే అంతగా కంటెంట్ లేని కథలను ఎంచుకోవడంతో హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి.

 Navadeep Has Changed His Mind About Marriage-TeluguStop.com

దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ విలన్ గా కూడా ఆకట్టుకున్నారు.అయితే అలాంటి నవదీప్ ( Navadeep) 40ఏళ్ల వయసు దాటినా కూడా పెళ్లికి దూరంగానే ఉన్నారు.

అంతేకాదు పెళ్లి గురించి ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో అడిగినా కూడా తనకి పెళ్లి నచ్చదు.నేను పెళ్లి చేసుకోను అనే విధంగానే మాట్లాడుతారు.

ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కూడా పెళ్లి చేసుకోను అనే విధంగానే మాట్లాడారు.అయితే ఎప్పుడు పెళ్లికి వ్యతిరేకంగా మాట్లాడే నవదీప్ తాజాగా తన సోషల్ మీడియా ( Social media )ఖాతాలో పెళ్లికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.నవదీప్ ప్రతిసారి తన మమ్మీ చెప్పినా తన నానమ్మ చెప్పినా ఎవరు చెప్పినా పెళ్లి విషయంలో తన నిర్ణయం మార్చుకునేదే లేదు అనే విధంగా ప్రవర్తిస్తాడు.

అయితే తాజాగా నవదీప్ ( Navadeep ) తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు.ఇక ఆ వీడియోలో నవదీప్ మాట్లాడుతూ.ఈరోజు ఉదయాన్నే మా మదర్ నన్ను పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళందరూ విడిపోతుంటే పెళ్లిళ్లు అంత బ్యాడ్ అయితే విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నార్రా అంటూ నన్ను అడిగింది.ఇక ఆమె అడిగిన ప్రశ్నకు నేను క్విట్ అంటూ సమాధానం ఇచ్చాను.

ఇక ఇంత పెద్ద లాజిక్ చెప్పాక ఎవరు మాత్రం కాదంటారు అనే విధంగా నవడీప్ ఆ వీడియోలో మాట్లాడారు.

దీంతో నవదీప్ కి పెళ్లి మీద అభిప్రాయం మారింది అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని అందరూ కామెంట్లు పెడుతున్నారు.అంతేకాదు ఈ వీడియోకి జరగాలి పెళ్లి అనే ఒక క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేయడంతో నవదీప్ త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మరి చూడాలి నవదీప్ పెళ్లి పై తన అభిప్రాయాన్ని మార్చుకొని పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభిస్తాడో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube