చంద్రయాన్‌ 2 : కొనసాగుతున్న నాసా ప్రయత్నం

ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రయోగించిన చంద్రయాన్‌ 2 ప్రయోగం చివరి దశలో విఫలం అయిన విషయం తెల్సిందే.ల్యాండర్‌ విక్రమ్‌ నుండి సిగ్నల్స్‌ తెగి పోవడంతో పాటు చంద్రుడిపై విక్రమ్‌ క్రాష్‌ ల్యాండింగ్‌ అయినట్లుగా ఇస్రో నిర్ధారించింది.

 Nasa Continue To Find The Vikram Lander-TeluguStop.com

క్రాష్‌ ల్యాండింగ్‌ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విక్రమ్‌ ఉందని, సింగిల్‌ పీస్‌గానే విక్రమ్‌ ఉందని ఇస్రో నిర్థారణకు వచ్చింది.దాంతో విక్రమ్‌ నుండి సిగ్నల్స్‌ను రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

విక్రమ్‌లో కదలికలు తీసుకు వచ్చేందుకు అమెరికా అంతరిక్ష ప్రయోగ కేంద్రం అయిన నాసా సాయంను కూడా తీసుకుంటుంది.నాసాతో ఒప్పందం కుదుర్చున్న నేపథ్యంలో అమెరికన్‌ శాస్త్రవేత్తలు ఇప్పటికే విక్రమ్‌లో కదలికలు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే రెండు రోజులుగా నాసా ప్రయత్నాలు చేస్తోంది.అయితే ఇంకా ఎలాంటి ఫలితం లేదు.మరో వారం రోజుల సమయం ఉంది కనుక నాసా మరియు ఇస్రో ప్రయత్నాలు ఫలిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.మరి ఎంత మేరకు విక్రమ్‌లో మళ్లీ కదలికలు తీసుకు వస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube