మీకు తెలుసా.. పాన్ ఇండియా రేంజ్‌లో 'మళ్లీ పెళ్లి'

సీనియర్‌ హీరో నరేష్‌, పవిత్ర లోకేష్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా( Malli Pelli Movie ) విడుదలకు సిద్ధంగా ఉంది.మొదట ఈ సినిమాను తెలుగు మరియు కన్నడంలో మాత్రమే విడుదల చేయాలని భావించారట.

 Naresh Pavitra Lokesh Movie Malli Pelli Pan India Release Details, Malli Pelli,-TeluguStop.com

తెలుగు లో నరేష్‌ కి( Sr Naresh ) మంచి క్రేజ్ ఉంది.అలాగే కన్నడం లో పవిత్ర లోకేష్ కి( Pavitra Lokesh ) ఉన్న క్రేజ్ నేపథ్యం లో ఈ సినిమా ను అక్కడ ఇక్కడ విడుదల చేయాలని భావించారట.

కానీ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చామని తాజా ప్రెస్ మీట్‌ లో దర్శకుడు ఎంఎస్ రాజు పేర్కొన్నాడు.హిందీ లో ఈ సినిమా ను విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు.

ఇప్పటికే డబ్బింగ్‌ వర్క్ జరుగుతోంది.

అతి త్వరలోనే సినిమాను అక్కడ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.తెలుగు తో సమానంగా కాకుండా కాస్త అటు ఇటుగానే అక్కడ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.ఆకట్టుకునే కథ మరియు కథనం తో ఈ సినిమా రూపొందింది అని.ఇది యూనివర్శిల్‌ సబ్జెక్ట్‌.కనుక 600 భాషల్లో విడుదల చేసినా కూడా సక్సెస్‌ అవుతుంది అన్నట్లుగా నరేష్‌ కామెంట్స్ చేశాడు.

పాన్ ఇండియా కథ మరియు కథనం తో వచ్చిన కొన్ని సినిమా లు ఉత్తర భారతంలో నిరాశ పర్చిన విషయం తెల్సిందే.ఈ సినిమా ను అక్కడ కావాలని విడుదల చేయడం లేదు.అక్కడి వారు కోరి మరీ విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారు.కనుక ఏం జరుగుతుందో చూడాలి.నరేష్ మరియు పవిత్ర ల యొక్క ప్రేమ కథ గురించి తెలుగు మరియు కన్నడ వారికి బాగా తెలుసు.కనుక ఇక్కడ అక్కడ ఆడియెన్స్ ఈ సినిమా ని ఆధరిస్తారేమో కానీ హిందీ లో ఈ సినిమా ను జనాలు పట్టించుకుంటారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube