మీకు తెలుసా.. పాన్ ఇండియా రేంజ్‌లో ‘మళ్లీ పెళ్లి’

సీనియర్‌ హీరో నరేష్‌, పవిత్ర లోకేష్ ముఖ్య పాత్రల్లో నటించిన 'మళ్లీ పెళ్లి' సినిమా( Malli Pelli Movie ) విడుదలకు సిద్ధంగా ఉంది.

మొదట ఈ సినిమాను తెలుగు మరియు కన్నడంలో మాత్రమే విడుదల చేయాలని భావించారట.

తెలుగు లో నరేష్‌ కి( Sr Naresh ) మంచి క్రేజ్ ఉంది.

అలాగే కన్నడం లో పవిత్ర లోకేష్ కి( Pavitra Lokesh ) ఉన్న క్రేజ్ నేపథ్యం లో ఈ సినిమా ను అక్కడ ఇక్కడ విడుదల చేయాలని భావించారట.

కానీ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చామని తాజా ప్రెస్ మీట్‌ లో దర్శకుడు ఎంఎస్ రాజు పేర్కొన్నాడు.

హిందీ లో ఈ సినిమా ను విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు.ఇప్పటికే డబ్బింగ్‌ వర్క్ జరుగుతోంది.

"""/" / అతి త్వరలోనే సినిమాను అక్కడ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

తెలుగు తో సమానంగా కాకుండా కాస్త అటు ఇటుగానే అక్కడ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆకట్టుకునే కథ మరియు కథనం తో ఈ సినిమా రూపొందింది అని.ఇది యూనివర్శిల్‌ సబ్జెక్ట్‌.

కనుక 600 భాషల్లో విడుదల చేసినా కూడా సక్సెస్‌ అవుతుంది అన్నట్లుగా నరేష్‌ కామెంట్స్ చేశాడు.

"""/" / పాన్ ఇండియా కథ మరియు కథనం తో వచ్చిన కొన్ని సినిమా లు ఉత్తర భారతంలో నిరాశ పర్చిన విషయం తెల్సిందే.

ఈ సినిమా ను అక్కడ కావాలని విడుదల చేయడం లేదు.అక్కడి వారు కోరి మరీ విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారు.

కనుక ఏం జరుగుతుందో చూడాలి.నరేష్ మరియు పవిత్ర ల యొక్క ప్రేమ కథ గురించి తెలుగు మరియు కన్నడ వారికి బాగా తెలుసు.

కనుక ఇక్కడ అక్కడ ఆడియెన్స్ ఈ సినిమా ని ఆధరిస్తారేమో కానీ హిందీ లో ఈ సినిమా ను జనాలు పట్టించుకుంటారా అనేది చూడాలి.

గేమ్ చేంజర్ కలెక్షన్స్ చూస్తే మతి పోతుంది…