Narasimha Raju: నా మనవరాలిని హీరోయిన్ గా చేస్తాను : నరసింహ రాజు

ఒకప్పటి కత్తి పట్టి యుద్దాలు చేసిన హీరోల్లో కాంతారావు తర్వాత చెప్పుకోదగ్గ మరొక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది నరసింహ రాజు.అయన జగన్మోహిని సినిమాలో నటించిన తీరు అద్భుతం.

 Narasimha Raju About His Grand Daughter Details, Narasimha Raju, Narasimha Raju-TeluguStop.com

ఎక్కువగా విఠలాచార్య సినిమాల్లో హీరో గా కనిపించారు.దాసరి సైతం ఆయనకు సినిమా జీవితం ఇచ్చిన వారిలో ఒకరు.

అందుకే సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కి వచ్చిన తొలినాళ్ళలో మళ్లి అవకాశాలు వచ్చే దాకా దాసరి ఇంట్లోనే అయన ఆశ్రయం పొందారు.ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రాకపోయినా సీరియల్స్ తో మంచి పేరు సంపాదించుకున్నారు.

అటు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా అనేక సీరియల్స్ ఆయన్ని నిలబెట్టాయి.

ఇక నరసింహ రాజు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటిస్తూ ఉన్నంతలో బాగానే ఉన్నారు.

అయన ఇద్దరు పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు.కొడుకు కెనడాలో ప్రొఫెసర్ గా పని చేస్తుండగా, కోడలు కూడా అక్కడే జాబ్ చేస్తుంది.ఇక కెనడా లో పదెకరాల స్థలం లో పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు చాల ఆస్తులు ఉన్నట్టు గా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.ఆలా ఇటీవల సోషల్ మీడియాలో పలు ఇంటర్వూస్ ఇస్తూ అయన తెగ హల్చల్ చేస్తున్నారు.

నరసింహ రాజు గారికి ఒక కూతురు మరియు కొడుకు ఉండగా కూతురు హైదరాబాద్ లోనే ఉంటుంది.

Telugu Simha Raju, Dasari Yana Rao, Jaganmohini-Movie

నరసింహ రాజు ఇంటి నుంచి వారసులు ఎవరు ఇండస్ట్రీ కి రాలేదు.అయన కూతురు లేదా కొడుకు ఇద్దరికి ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం తో అయన తర్వాత మరొక తరం ఎవరు లేరు.అయితే తన కొడుకు కూతురు అంటే అయన మనవరాలికి సినిమా అంటే చాల ఇష్టం అని బాగా డ్యాన్స్ కూడా చేస్తుందని, ట్రెడిషనల్ నాట్యం కూడా నేర్చుకుంటుందని నరసింహ రాజు చెప్తున్నారు.

ఒక హీరోయిన్ కి కావాల్సిన అన్ని లక్షణాలు ఆమెకు ఉన్నాయని, సినిమాల్లోకి వస్తే సావిత్రి అంత రేంజ్ కి వెళ్లే అవకాశం ఉందని అతి త్వరలో ఆమెను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తా అంటూ చెప్పడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube