పిల్లలపై అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని లోకేష్ ఆరోపించారు.గుంటూరులో క్రిమినల్ కత్తిపోట్లకు మొన్న రమ్య నేలకొరిగితే నిన్న గుంటూరు జిల్లా రాజుపాలెం పశువాంఛలకు చిన్నారి బలైందన్నారు.
ఈ రెండు ఘటనలు మరవకముందే విజయనగరం జిల్లా చౌడువాడ లో ఉన్మాది పెట్రోల్ పోసి యువతిని తగల పెట్టడం బాధాకరమన్నారు.మూడు రోజుల్లో ఆడపిల్లలపై మూడు అమానవీయ ఘటనలు జరిగినా దున్నపోతులాంటి ప్రభుత్వంలో స్పందన లేదని ఆయన ఆరోపించారు.
గుంటూరు జిల్లా రాజుపాలెం లో సామూహిక అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని శుక్రవారం లోకేష్ ఫోన్ లో పరామర్శించారు.తన కూతురికి జరిగిన అన్యాయాన్ని సూచి జీవించాలని ఆచ పోయిందని.
చనిపోతానని బాధితురాలి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.ధైర్యం కోల్పోవద్దని న్యాయం జరిగే వరకు పోరాడదామని మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా పోరాడాలని అన్నారు.
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.

జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేదన్నారు.ఇప్పటికైనా లేని ఆ దిశ చట్టం, దిశా యాప్ పేరుతో ప్రసారం చేసుకోవద్దని పేర్కొన్నారు.నిందితులను పట్టుకొని శిక్షించడం లో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తే మానవమృగాలు బరితెగించరని అన్నారు.
ఇది నిందితులను రక్షించే ప్రభుత్వం , క్రిమినల్స్ చేలరేగిపోతున్నారని ఆడపిల్లలు ఉసురు మీకు, రాష్ట్రానికి మంచిది కాదని మహిళల భద్రతపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రిని కోరారు.