నేను నిన్ను నమ్ముతాను...నువ్వు నన్ను నమ్ము అంటూ నాని పోస్ట్... ఎవరికోసం ఈ పోస్ట్?

నాచురల్ స్టార్ నాని (Nani) మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హాయ్ నాన్న(Hai Nanna).కొత్త దర్శకుడు శౌర్యువ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో రాబోతుంది.

 Nani Interesting Tweet On Hai Nanna Movie Post Goes Viral Details, Nani, Mrunal-TeluguStop.com

ఈ మూవీలో శృతిహాసన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైనటువంటి పోస్టర్స్ పాటలు ఎన్నో అంచనాలను పెంచేశాయి.

ఇక ఈ సినిమాని ముందుగా డిసెంబర్ 21వ తేదీ విడుదల చేయాలని మేకర్స్ భావించారు.అయితే ప్రస్తుతం మాత్రం ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం లేదా ఫ్రీ ఫోన్ అవడం జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై ఏ విధమైనటువంటి ప్రకటన మేకర్స్ వెల్లడించలేదు.

ఇదిలా ఉండగా నాని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇందులో భాగంగా ఈయన హాయ్ నాన్న సినిమా నుంచి ఒక పోస్టర్ షేర్ చేయడమే కాకుండా ఇక టీజర్ ని (Hai Nanna Teaser) ఈ ఆదివారం (అక్టోబర్ 15) ఉదయం గం.11:00 రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశాడు. ఈ పోస్ట్ నాని షేర్ చేస్తూ నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నన్ను నమ్ము.ఆ తరువాత అంతా మ్యాజిక్‌గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసే సమయంలోనే విడుదల తేదీ గురించి కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా క్రిస్మస్ పండుగ( Christmas ) సందర్భంగా డిసెంబర్ 21వ తేదీ విడుదల చేయాలని భావించారు.అయితే 22వ తేదీ షారుక్ ఖాన్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.ఇక ఇది మిస్ చేసుకుంటే సంక్రాంతి బరిలో కూడా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాని అనుకున్న తేదీ కంటే ముందుగానే విడుదల చేస్తారని తెలుస్తోంది.ఈ సినిమా విడుదల తేదీ విషయం గురించి కూడా టీజర్ విడుదల సమయంలోనే క్లారిటీ ఇస్తారేమోనని అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

దసరా వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నాని హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube