సంతానలేమి.ఇటీవల కాలంలో ఈ సమస్యతో బాధ పడుతున్న జంటలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.వాస్తవానికి దాంపత్య జీవితం సంతానంతోనే సంపూర్ణం అవుతుంది.కానీ, పెళ్లై ఎన్నేళ్లైనా కొన్ని జంటలకు సంతానం కలగక చింతిస్తుంటారు.ఈ క్రమంలోనే హాస్పటళ్లు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ.ఏవేవో మందులు కూడా వాడుతుంటారు.
అయితే సంతానం కలగాలంటే మందులు వాడటమే కాదు.తీసుకునే ఆహారంలోనూ కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
పండ్లు, కాయగూరలు, ఆకుకూరలే కాదు.నట్స్( బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, కిస్‌మిస్, వాల్నట్స్)ను కూడా డైట్‌లో చేర్చుకోవాలి.
ఎందుకంటే, సంతాన సమస్యలను దూరం చేయడంలో నట్స్ గ్రేట్‌గా సహాయపడతాయి.అయితే నట్స్ ను రెగ్యులర్ తీసుకోవచ్చా అన్నది చాలా మందికి ఉన్న సందేహం.వాస్తవానికి రోజుకు యాబై నుంచి అరవై గ్రాముల నట్స్.అవి ఏవైనా కానివ్వండి నిశ్చింతగా తీసుకోవచ్చు.
ప్రతి రోజు నట్స్ తీసుకోవడం వల్ల.అందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్, గుడ్ ఫ్యాట్ మరియు పలు రకాల విటమిన్లు సంతాన సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కేవలం ఆడవారు మాత్రమే కాదు.మగవారు కూడా రెగ్యులర్‌గా నట్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.పురుషులు నట్స్ తీసుకోవడం వల్ల వీర్మ కణాల సంఖ్య పెరగడం మాత్రమే కాదు.స్పార్మ్ నాణత్య కూడా పెరుగుతుంది.
ఇక నట్స్ తినడం వల్ల సంతాన సమస్యలు తీరడమే కాదు.మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ప్రతి రోజు నట్స్ తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి.గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.
అలాగే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలకు గురవుతున్నారు.అయితే నట్స్‌ను తీసుకోవడం వల్ల.వాటిలో ఉంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది.అదే విధంగా, నట్స్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది.
ఎముకులను, దంతాలను బలంగా మారతాయి.అయితే నట్స్ తినడంతో పాటు రెగ్యులర్‌గా వ్యాయామం కూడా చేయాలని నిపుణులు చెబుతున్నారు.