ఏప్రిల్ 6న నాని, `అంటే సుందరానికి` చిత్రం నుంచి మొదటి సింగిల్ పంచెకట్టు రిలీజ్‌

ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `అంటే సుందరానికి`. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

 Nani Ante Sundaraniki First Single Panchekattu On April 6 Details, Nani, Vivek A-TeluguStop.com

ఈ చిత్రానికి వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు.ఈ సంద‌ర్భంగా మొదటి సింగిల్ పంచెకట్టును ఏప్రిల్ 6న సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో నాని, తన విదేశీ పర్యటన USAలోని సుందరమైన లొకేషన్‌లను ఆస్వాదిస్తూ, కారుడోర్‌లోంచి తల బయట పెట్టుకుని ఆశ్చ‌ర్యంగా పైకి చూస్తూ నవ్వుతూ కనిపించాడు.ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కాగా, ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ వ‌చ్చింది.

నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు లీలా థామస్.

ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహించారు.అంటే సుందరానికి జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం:

నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

రచయిత, దర్శకుడు: వివేక్ ఆత్రేయ నిర్మాతలు: నవీన్ యెర్నేని & రవిశంకర్ వై బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ CEO: చెర్రీ మ్యూజిక్ కంపోజర్: వివేక్ సాగర్ సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి ఎడిటర్: రవితేజ గిరిజాల ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను PRO: వంశీ శేఖర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube