Kalyan Ram: జై ఎన్టీఆర్, జై హరికృష్ణ అంటూ నినాదాలు చేసిన కళ్యాణ్ రామ్.. బాలయ్యను మరిచిపోయావా అంటూ?

నందమూరి హీరోల మధ్య గ్యాప్ వచ్చింది అని గత కొంతకాలంగా వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఆ వార్తలకు అనుగుణంగా పలు సందర్భాలలో పలు కార్యక్రమాలలో కనిపించిన దృశ్యాలు వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చాయి.

 Nandamuri Kalyan Ram Did Not Say Jai Balayya At Devil Trailer Launch Event-TeluguStop.com

నందమూరి తారకరత్న సంతాప సభలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ ను కావాలనే బాలకృష్ణ( Balakrishna ) పట్టించుకోలేదని ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది.ఆ సమయంలో ఎన్టీఆర్ అభిమానులు బాలయ్యపై సోషల్ మీడియాలో మండిపడ్డారు.

అలాగే చంద్రబాబు నేతృత్వంలో బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ శతజయంతి వేడుకల్లో కావాలనే ఎన్టీఆర్,( NTR ) కళ్యాణ్ రామ్( Kalyan Ram ) పాల్గొనలేదని బాలకృష్ణ అభిమానులు విమర్శించారు.

ఇక ఇటీవల చంద్రబాబు నాయుడిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపినప్పుడు నందమూరి ఫ్యామిలీలో అందరూ స్పందించినా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం నోరెత్తలేదు.దీంతో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌పై బాలకృష్ణ అభిమానులు, టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు.

అవన్నీ పక్కన పెడితే తాజాగా డెవిల్ ట్రైలర్( Devil Trailer ) లాంచ్ ఈవెంట్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్య ఊసెత్తకపోవడం తో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు ఆజ్యం పోసినట్టు అయింది.అసలేం జరిగిందంటే.

Telugu Balakrishna, Chandrababu, Devil, Devil Trailer, Deviltrailer, Hari Krishn

కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్,( Samyuktha Menon ) మాళవిక నాయర్( Malavika Nair ) హీరోయిన్లుగా అభిషేక్ నామా తెరకెక్కించిన సినిమా డెవిల్ – ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. 1940 కాలం నేపథ్యంలో పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్ మాట్లాడారు.అభిమానులకు కావాల్సిన సమాచారం అంతా ఇచ్చారు.

తర్వాత చివరలో స్పీచ్ ముగిస్తూ జై ఎన్టీఆర్, జైజై ఎన్టీఆర్, జై హరికృష్ణ అని తాత, నాన్న పేర్లతో నినాదాలు చేశారు.

Telugu Balakrishna, Chandrababu, Devil, Devil Trailer, Deviltrailer, Hari Krishn

కానీ, జై బాలయ్య( Jai Balayya ) అని మాత్రం కళ్యాణ్ రామ్ అనలేదు.నిజానికి కళ్యాణ్ రామ్ కన్నా ముందు దర్శక నిర్మాత అభిషేక్ నామా మాట్లాడారు.ఆయన జై బాలయ్య అనే నినాదంతోనే స్పీచ్ మొదలుపెట్టారు.

ఆయన జై బాలయ్య అన్నప్పుడు కళ్యాణ్ రామ్ కూడా నవ్వారు.కానీ, తన స్పీచ్‌లో మాత్రం బాలయ్య ఊసెత్తలేదు.

దీంతో బాబాయ్‌తో అబ్బాయికి నిజంగానే దూరం పెరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి.ఈ వార్తలపై స్పందించిన పలువురు నెటిజన్స్ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఏంటి బాబాయ్ ని మర్చిపోయావా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube