నందమూరి కళ్యాణ్ రామ్( Kalyan Ram ) బింబిసార సినిమా తో సక్సెస్ దారి లో పడ్డాడు అనుకునే లోపే మరో ఫ్లాప్ ను మూట కట్టుకున్నాడు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
అయినా కూడా కళ్యాణ్ రామ్ ఏమాత్రం తగ్గకుండా తన తదుపరి సినిమా డెవిల్ ను భారీ ఎత్తున రెడీ చేస్తున్నాడు.విభిన్నమైన సినిమా గా ఇది తన కెరీర్ లో నిలిచి పోతుంది అంటున్న కళ్యాణ్ రామ్ మాటలతో సినిమా పై అంచనాలు పెరిగాయి.
ఈ నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్ యొక్క డెవిల్ సినిమా నవంబర్ లో రావడం లేదు.
దాంతో చాలా మంది అవాక్కవుతున్నారు.ఎందుకు ఈ సినిమా ను విడుదల చేయడం లేదు అంటూ కొందరు కామెంట్స చేస్తే కొందరు అప్పుడే సినిమా ఫ్లాప్ అని తెలిసి పోయిందా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.అసలు విషయం ఏంటి అంటే ఈ సినిమా యొక్క రీ రికార్డింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు.పీరియాడిక్ మూవీ అవ్వడం వల్ల గ్రాఫిక్స్ మరియు రీ రికార్డింగ్ విషయం లో ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు.అందుకే ఎక్కువ సమయం పడుతుంది అంటూ సమాచారం అందుతోంది.
త్వరలోనే సినిమా యొక్క కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాము అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులు మరియు నందమూరి అభిమానులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ కళ్యాణ్ రామ్ తో పాటు మేకర్స్ చెబుతున్నారు.ఇప్పటికే విడుదల అయిన పాట మంచి మార్కులు దక్కించుకుంది.సంయుక్త మీనన్ నటిస్తున్న ఈ సినిమా కచ్చితంగా విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది.కళ్యాణ్ రామ్ కెరీర్ కి ఇది కీలకంగా మారబోతుంది.