అక్కినేని నాగేశ్వరరావు ( Akkineni Nageswara Rao )మరణించి చాలా సంవత్సరాలు అవుతున్నా అభిమానుల హృదయాల్లో మాత్రం ఆయన జీవించి ఉన్నారనే సంగతి తెలిసిందే.అక్కినేని నాగేశ్వరరావు తొలి సినిమా పేరు ధర్మపత్ని( Dharmapatni ) కాగా ఈ సినిమాకు పుల్లయ్య దర్శకత్వం వహించారు.
పుల్లయ్యగారు షూటింగ్ విరామంలో అక్కినేని నాగేశ్వరరావుతో సరదాగా పద్యాలు పాడించుకునేవారు.పుల్లయ్యగారు కొన్నిసార్లు తనకంటే చిన్నవాళ్లతో సరదాగా మాట్లాడేవారట.
అయితే ఆయన చేసిన కామెంట్లు కొంతమందిని మాత్రం బాధ పెట్టాయట.ధర్మపత్ని సినిమాలో నటించే సమయానికి అక్కినేని వయస్సు 17 సంవత్సరాలు కాగా నాటకరంగం నుంచి వచ్చిన ఏఎన్నార్ పద్యాలు బాగా పాడేవారట.
ఒకరోజు ధర్మపత్ని షూటింగ్ లొకేషన్ కు కొంతమంది అతిథులు వచ్చారు.
పుల్లయ్యగారు వాళ్లతో పిచ్చాపాటీ మాట్లాడుతూ అక్కినేనిని పిలిచి ఒక పద్యం పాడమని కోరగా ఆయన గతంలో పాడిన పద్యాన్నే పాడటంతో పుల్లయ్య గారు ప్రతిసారి ఇదే పద్యం పాడతావేంట్రా అని అనాలనుకుని ముతక మాట అని అన్నారు.ఆ మాట విన్న వెంటనే అక్కినేని కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి.బాధ పడుతూనే మెరీన బీచ్ కు వెళ్లిన అక్కినేని అక్కడ ఇసుక తిన్నెలపై కూలబడి బాధ పడ్డారు.
ఈ ఘటన జరిగిన 13 సంవత్సరాల తర్వాత పుల్లయ్య అర్ధాంగి అనే సినిమాను మొదలుపెట్టారు.ఆ సినిమాలోని పాత్ర కోసం పుల్లయ్య ఏఎన్నార్ ను సంప్రదించగా ఆ సమయంలో ఏఎన్నార్ ముతకమాట అని చేసిన కామెంట్ గురించి ప్రస్తావించారట.ఆ మాటకు షాకవ్వడం పుల్లయ్య వంతైంది.అప్పుడు చిన్నాపిల్లాడివి కాబట్టి సరదాగా అన్నానని ఆ సమయంలో పుల్లయ్య వివరణ ఇచ్చారు.అక్కినేని జీవితంలోని మరపురాని ఘటనలలో ఈ ఘటన కూడా ఒకటి కావడం గమనార్హం.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.