సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఒకరు ఈయన చేసినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైనటువంటి క్రేజ్ చేసుకున్నారు.ఇక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే తప్పకుండా ఆయన సినిమాలో కమెడియన్ అలీ( Ali ) ఉండాల్సిందే.
అలీ లేకుండా అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చేవి కాదు అంతగా వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది ఇలా ప్రతి ఒక్క సినిమాలను పవన్ కళ్యాణ్ అలీ కాంబినేషన్లో వచ్చే సీన్స్ కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటూ ఉంటాయి.ఇలా సినిమాల పరంగా ప్రాణ స్నేహితులు అయినప్పటికీ వీరిద్దరూ రాజకీయాలలోకి( Politics ) ఎప్పుడు వచ్చారో అప్పుడు వీరి దారులు వేరయ్యాయి.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ( Janasena Party ) ని స్థాపించినప్పటికీ అలీ మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీలో కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీ ( YSRCP Party ) వైపు అడుగులు వేశారు ఇలా పార్టీకి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్ అలీ మధ్య దూరం కూడా పెరిగిపోయింది.
ఇక వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి అలీ ప్రస్తుతం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా కూడా పనిచేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే రాజకీయపరంగా ఒక ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ అవసరమైతే తాను పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి కూడా సిద్ధమే అంటూ మాట్లాడారు.
ఈ విధంగా పవన్ పై పోటీకి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ అలీ మాట్లాడటంతో అప్పట్లో అలీ వ్యాఖ్యలపై కౌంటర్లు కూడా వచ్చాయి.ఇలా పవన్ మధ్య ఇప్పుడు రాజకీయాల పరంగా చాలా దూరమే పెరిగిందని చెప్పాలి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబు ( Nagababu ) పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ అలీ మధ్య పెరిగిన దూరం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి .అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగిందని ప్రశ్నలు ఎదురుగా నాగబాబు అసలు ఆలీ పవన్ కళ్యాణ్ మధ్య గొడవ ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా వివరించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అలీ ఇద్దరు కూడా మంచి స్నేహితులు వారి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు.అలీ వేరే పార్టీలోకి వెళ్లిపోవడంతో కళ్యాణ్ బాబు ఒకసారి మాత్రమే నేను అలికి చాలా ఉపయోగపడ్డాను ఇలా చేస్తారని అనుకోలేదు అనే ఒకే ఒక్క మాట మాత్రమే మాట్లాడారు అంతకుమించిఎక్కడ ఎప్పుడు గొడవ కూడా జరగలేదని నాగబాబు తెలిపారు.పవన్ పై పోటీ చేస్తాను అని అలి అనడం గురించి కూడా మేము పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదని తెలిపారు.
ఆయన ఒక పార్టీలో ఉన్నారు పార్టీ హై కమాండ్ చెప్పిన విధంగానే ఆయన మాట్లాడి ఉంటారు అంతకుమించి ఏమీ ఉండదని ఈ విషయాన్ని పవన్ కూడా సీరియస్ గా తీసుకోలేదని నాగబాబు తెలిపారు.ఇప్పటికీ వీరిద్దరూ కలిసిన మాట్లాడుకుంటారు అయితే అప్పటికన్నా కాస్త దూరమైతే పెరిగిందని మరి మాట్లాడుకోకుండా ఉండే అంత దూరం కాదని నాగబాబు తెలిపారు.
అది కూడా తన కూతురు పెళ్లికి కళ్యాణ్ బాబుని అలీ ఆహ్వానించారు.నా ఎదురుగానే వెడ్డింగ్ కార్డు ఇచ్చి పెళ్లికి పిలిచారు కానీ అప్పుడు మంగళగిరిలో కళ్యాణ్ బాబు ఉన్న నేపథ్యంలో తన కుమార్తె పెళ్లికి రాలేకపోయారని ఈ సందర్భంగా నాగబాబు పవన్ కళ్యాణ్ అలీ మధ్య దూరం గురించి క్లారిటీ ఇచ్చారు.