మురళీ మోహన్ పెద్దగా ఎవ్వరికి ఈయన గురించి చెప్పవలసిన అవసరం లేదు.పరిచయం చేయక్కలేని మనిషి.
చంద్రబాబు నాయుడుకి నమ్మిన బంటు.రాజకీయాలంటే ఎంతో ఆశక్తి ఉన్న సిని నటుల్లో ఒకరు.
మా అధ్యక్షుడిగా.రియలెస్టేట్ వ్యాపారిగా ఎంతో కీర్తిని.
ఆర్ధిక శక్తిని గడించాడు.అయితే చాలా కాలం సైలెంట్గా ఉన్న రాజమండ్రి ఎంపీ మురళి మోహన్ రాబోయే ఎన్నికల దృష్ట్యా స్పీడ్ అయ్యేందుకు రెడీ అయ్యారు.
అందుకోసం మెగా ప్లాన్ వేశారు ఎంపీ.ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించి వారికి దగ్గరయ్యేందుకు మెగా వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టనున్నారు.
2009 పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ పై స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలు అయ్యాక మురళీమోహన్ పట్టుదలగా రాజమండ్రి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువ అయ్యారు.సినీ షో లు కూడా ఏర్పాటు చేశారు.
వీటన్నింటికన్నా అందరికి ఉపయోగపడింది ఆయన నిర్వహించిన మెగా వైద్య శిబిరాలు.అవును అవే మురళీ మోహన్ కి పెద్ద అసెట్ అయ్యాయి.అందుకే మరోసారి తన ప్లాన్ అమలు పరిచే పనిలో ఉన్నాడు.
2014 ఎన్నికల్లో గెలిచాకా దాదాపు నాలుగేళ్లు ఆయన నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు, నంది నాటకోత్సవాలు తప్ప పెద్దగా జనంలో తిరిగింది లేదు.అదీగాక ఎమ్యెల్యేలు ఆధిపత్య పోరు, పార్టీలో వున్న గ్రూప్ ల గోలతో ఆయన పర్యటనలు చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఉంటుందన్న పరిస్థితుల్లో దూరంగా వుంటూ వచ్చారు.ఇప్పుడు ఎంపీ సీట్ మళ్ళి తనకు లేదా తన కోడలు రూపకు దక్కించుకోవాలంటే తిరిగి పాత ఇమేజ్ ప్రజల్లో తెచ్చుకుని అధినేత దృష్టిలో పడాలి.
ఈ నేపథ్యంలో ఆయన మెగా వైద్య శిబిరాలకు శ్రీకారం చుడుతున్నారు.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్లాన్ చేసి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అర్బన్ , రూరల్ రాజానగరం, అనపర్తి , కొవ్వూరు , నిడదవోలు, నియోజకవర్గాల్లో ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు.
ఈనెల 28 న రాజమండ్రిలో దీనికి శ్రీకారం చుట్టి దఫ దఫా లుగా కొనసాగిస్తారు.మరి ఈసారి మురళి మోహన్ మంత్రాంగం చంద్రబాబు ముందు పనిచేస్తుందా లేక చతికల పడుతాడా అనేది ముందు ముందు తెలిసిపోతుంది.