ఈ రోజుల్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు గుండెపోటు( Heart Attack ) కారణంగా మరణిస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఒకటి తర్వాత ఒకరు ఈ గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు.
అతి చిన్న వయసులోనే ఈ హార్ట్ స్ట్రోక్ కారణంగా మరణిస్తున్నారు.నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
మిస్టర్ తమిళనాడ( Mr.Tamilnadu ) టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్ యోగేశ్( Yogesh ) గుండెపోటుతో మరణించారు.కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
కొన్ని పరిశోధనలు దీనికి మద్దతు ఇస్తుండగా, కొన్ని కోవిడ్ కారణంగా ఇటువంటి సంఘటనలు జరగడం లేదని నిపుణులు చెప్పినట్లు నివేదికలు ఉన్నాయి.అయితే ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తూ ఫ్యాట్‌కు దూరంగా ఉండే వారు ఇలా చనిపోవడం సర్వసాధారణమైపోతోంది.యోగేష్ చెన్నైలోని ( Chennai ) అంబత్తూరు మేనంపేడులోని మహాత్మాగాంధీ వీధిలో నివాసం ఉంటున్నాడు.
అతను బాడీ బిల్డర్,( Body Builder ) కొన్ని సంవత్సరాలుగా వివిధ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని అనేక పతకాలు సాధించాడు.అతను 2021లోనే 9కి పైగా మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.బాడీబిల్డింగ్‌లో మిస్టర్ తమిళనాడు అవార్డును కూడా అందుకున్నాడు.2021లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది.పెళ్లి అనంతరం బాడీబిల్డింగ్ పోటీలకు విరామం ప్రకటించిన యోగేశ్.ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే జిమ్‌కు వెళ్లిన ఆయన శిక్షణ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన యోగేశ్.బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు.దీనిని గమనించిన యువకులు వెంటనే యోగేశ్‌ను స్థానిక కిల్పౌక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.దీంతో యోగేశ్ గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పెళ్లైన తర్వాత బాడీబిల్డింగ్కు విరామం ప్రకటించి తక్కువ బరువులు ఎత్తుతున్న యోగేశ్.ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు.