Motorola నుంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో 5G స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

మోటోరోలా నుంచి మోటో G34 5G ( Moto G34 5G ) స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ తో గత నెలలో చైనాలో లంచ్ అయింది.త్వరలోనే భారతీయ మార్కెట్లో లాంచ్ అవ్వనుంది.

 Motorola నుంచి ఫ్రెండ్లీ బడ్జెట్ ల�-TeluguStop.com

జనవరిలో 9 లేదా 10వ తేదీ భారత మార్కెట్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ 5G స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలు ఏమిటో చూద్దాం.

Moto G34 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.5 అంగుళాల HD+ LCD డిస్ ప్లే తో వస్తోంది.50 మెగా పిక్సెల్ ప్రధాన సెన్సార్ తో కూడిన డ్యూయల్ కెమెరా( Dual Camera ) సెట్ అప్ తో ఉంటుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.భారత మార్కెట్లో( India Market ) విడుదలయ్యే moto G34 5G స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే.8GB RAM+ 128GB స్టోరేజ్ తో ఉంటుంది.సీ బ్లూ, స్టార్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంటుంది.

వర్చువల్ RAM గా 8GB వరకు ఉపయోగించని నిల్వను ఉపయోగించుకోవచ్చు.ఈ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి.

సెల్ఫీల కోసం, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో ఉంటుంది.

ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మొస్ తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో( Dual Stereo Speakers ) వస్తుంది.18W ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.

చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధర CNY 999 గా ఉంది.మన భారత కరెన్సీలో రూ.11600 గా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube