భారతీయ కమ్యూనిటీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా భారత్- సింగపూర్ మధ్య లోతైన సంబంధాలను ఏర్పరచడంలో వారి సహకారాన్ని ప్రశంసించారు.
భారతదేశ వృద్ధిలో పాలు పంచుకోవాలని మురళీధరన్ ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.ఇక సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం ఆ దేశ విద్యా శాఖ సెకండ్ మినిస్టర్ మాలికీ బిన్ ఉస్మాన్‌తో మురళీధరన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రవాస భారతీయుల సమస్యలు,
తదితర అంశాలపై చర్చలు జరిపారు.దీనికి సంబంధించిన వివరాలను ఆయన ట్వీట్ చేశారు.
అనంతరం సింగపూర్‌లోని హిందూ ఎండోమెంట్స్ బోర్డు సభ్యులతోనూ మురళీధరన్ భేటీ అయ్యారు.అలాగే స్థానిక శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మురళీధరన్ ఫిబ్రవరి 18 నుంచి ఆస్ట్రేలియా, సింగపూర్‌లలో పర్యటిస్తున్నారు.ఇవాళ్టీతో ఆయన విదేశీ పర్యటన ముగియనుంది.
గత ఆదివారం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఆ దేశ విద్య, ఆదివాసుల వ్యవహారాలు, పౌరసత్వం , బహుళ సాంస్కృతిక ప్రయోజనాల శాఖ మంత్రి టోనీ బుటి, పశ్చిమ ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఎంపీలతోనూ మురళీధరన్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా విద్య, వాణిజ్యం, పర్యాటక రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందించే అవకాశాలపై చర్చించారు.అంతకుముందు ఆయన శనివారం మెల్‌బోర్న్‌లోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.ఆస్ట్రేలియాతో భారత్ సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి గాను ఎన్ఆర్ఐలను మురళీధరన్ ప్రశంసించారు.
ఈ భేటీకి సంబంధించి కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.మెల్‌బోర్న్‌లోని ప్రవాస భారతీయులతో సంభాషించడం ఆనందంగా వుందన్నారు.వారి సహకారానికి అభినందనలు తెలియజేసినట్లుగా మురళీధరన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.ఇకపోతే.ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు ఫిజిలో భారత్-ఫిజీ ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన 12వ ప్రపంచ హిందీ సదస్సులో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో కలిసి మురళీధరన్ పాల్గొన్నారు.ఆ తర్వాత కేంద్ర మంత్రులిద్దరూ నాడిలోని శ్రీ శివ సుబ్రమణ్య కోవిల్‌ను సందర్శించారు.