టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏపీపై చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రానికి డబ్బులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు.కావాలనే సీఎం జగన్ ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని విమర్శించారు.14 ఏళ్లు సీఎంగా ఉండి ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు.జగన్ పేదలకు పథకాలు ఇస్తుంటే అక్కసుతో అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రమని విమర్శలు గుప్పించారు.