రాజకీయ నాయకుల మాటలు కోటలు దాటుతాయి.చేతల్లో మాత్రం సున్నాలు కనిపిస్తాయి.
ఇప్పటికే తెలంగాణ తెగులుపట్టి వాడిపోతుంటే నేతలు మాత్రం అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారట.
ఇక అభివృద్ధి గురించి తెలంగాణను చూసి నేర్చుకోవాలంటున్నారు కొందరు.
ఎందుకంటే వర్షం వస్తే చెరువులను తలపిస్తాయి.ఇక డ్రైనేజీ సమస్యలైతే ప్రజల ఆస్తుల్లాగా మిగిలిపోతున్నాయి.
ఇదిలా ఉండగా మంత్రి కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ ఓల్డ్ విలేజ్‌లో సమస్యలు తిష్ట వేసుకు కూర్చున్నాయట.అందుకే మంత్రి కేటీఆర్ దత్తత డివిజన్ కాస్త చెత్త డివిజన్‌గా తయారు అయిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలో హైదర్ నగర్ గ్రామంలోని పలు బస్తీలలో డ్రైనేజీ ఇబ్బందులు, మంచినీటి అసౌకర్యం, ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం పేరుకుపోయి కంపు కొడుతుందట.ఈ నేపధ్యంలో అయ్యా కేటీఆర్ సారు ఇంకెన్నాళ్లు మాకు ఈ సమస్యలు.
దుర్గంధం వెదజల్లుతున్న పరిసరాలతో తప్పని తిప్పలు అంటూ స్థానికులు వాపోతున్నారట.