బీఆర్ఎస్ పార్టీపై ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.మోదీ వలన లాభపడింది కేవలం అదానీ వంటి వ్యాపారవేత్తలేనని హరీశ్ రావు తెలిపారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.తాము రాష్ట్రంలో రైతులు మరియు బలహీన వర్గాలకు ఏజెంట్స్ గా ఉంటున్నామని తెలిపారు.
కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు బియ్యం విక్రయించాలని కోరుతున్నారంటే తెలంగాణలో వరి పంట ఎంతలా పండుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు.ప్రజల సంక్షేమం కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఈ సారి కూడా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.