తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.ఈనెల 28వ తారీకు ప్రచారానికి చివరి రోజు కావడంతో ఇంక రెండు వారాలు మాత్రమే టైమ్ ఉండటంతో.
ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇదే సమయంలో ప్రజలకు రకరకాల హామీలు ప్రకటిస్తూనే మరోపక్క ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.
తాజాగా బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో గొల్లకుర్ముల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayakar Rao ).కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికలలో ఓటు అనే వజ్రాయుధాన్ని ఆలోచించి వేయాలని.తొందరపడి ఓటు వేయొద్దని సూచించారు.
ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని పేర్కొన్నారు.60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గొల్లకుర్మాలకు.తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.అటువంటి గొల్ల కుర్మాలకు సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారని పొగడ్తల వర్షం కురిపించారు.గొర్రెల యూనిట్లను అత్యధికంగా పాలకుర్తిలో పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు.మూడు పంటలు కావాలా.? మూడు గంటల కరెంట్ కావాలా.? అని ప్రజానీకాన్ని ప్రశ్నించారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.ఇదే సమయంలో 10HP పెట్టి మూడు గంటలు కరెంటు ఇస్తామని మాట్లాడటం సిగ్గుచేటాని అవివేకానికి నిదర్శనమని సెటైర్లు వేశారు.
గొల్ల కుర్మలకు ఆపత్కాలంలో అండగా ఉన్నాను.వచ్చే ఎన్నికలలో ఆదరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మొదట ఈ కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించగా అనంతరం మంత్రి ఎర్రబెల్లికి మేకపిల్ల, గొంగడి బహుకరించారు