సంక్రాంతి అంటేనే మన తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ అనే చెప్పాలి.అందుకే ఈ పండుగకు భారీ సినిమాలు రిలీజ్ అవుతాయి.
పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లను ఈ పండుగకు ఫిక్స్ చేసుకుంటారు.ఎందుకంటే పండుగ సీజన్ లో కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మోత మోగించడం ఖాయం.
అందుకే సంక్రాంతి పండుగనే టార్గెట్ చేసుకుని తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు స్టార్స్.
మరి ఈసారి 2023 కు కూడా స్టార్స్ తమ సినిమాలను బరిలోకి దింపేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఈసారి కూడా భారీ పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు.ఈసారి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు.మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో రాబోతుండగా.బాలయ్య వీరసింహ రెడ్డి సినిమాతో రాబోతున్నాడు.
చాలా రోజుల తర్వాత వీరిద్దరూ పోటీ పడడంతో రసవత్తరంగా మారింది.
అలాగే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో రాబోతుండగా.
మరో రెండు తమిళ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.విజయ్ దళపతి వారసుడు అలాగే అజిత్ తునివు సినిమా రిలీజ్ కాబోతుంది.ఈ 5 సినిమాల్లో ఏది హిట్ అవుతుందో అని ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.అయితే సంక్రాంతి వార్ కంటే ముందే రవితేజ ధమాకా సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కాబోతుంది.
ఇంకా నిఖిల్ 18 పేజెస్ కూడా అదే రోజు అంటే డిసెంబర్ 23న రాబోతున్నాడు.ఇక రణవీర్ సింగ్ సర్కస్ సినిమా కూడా ఇదే డేట్ రాబోతుంది.అలాగే విజయ్ సేతుపతి, కత్రినా కలిసి నటించిన మెర్రీ క్రిస్మస్ రిలీజ్ కాబోతుంది.ఇంకా స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా క్రిస్మస్ సమయంలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇంకా చాలా సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.దీంతో సంక్రాంతికి ముందే మినీ వార్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.