చలికాలం మొదలైంది.చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.
అయితే చలికాలంలో ప్రధానంగా వేధించే సమస్యల్లో పొడి చర్మం ముందు వరసలో ఉంటుంది.ఈ సమస్యను నివారించుకునేందుకు చాలా మంది ఖరీదైన మాయిశ్చరైజర్స్, లోషన్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే కొన్ని సార్లు ఎంత ఖరీదైన ఉత్పత్తులను వినియోగించినా ఫలితం మాత్రం పెద్దగా ఉండదు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను ప్రయత్నిస్తే మాత్రం పొడి చర్మానికి సులభంగా బై బై చెప్పొచ్చు.
మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి.? అన్నది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక మీడియం సైజ్ బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.ఈ బీట్ రూట్ తురుము నుంచి జ్యూస్ ను వేరు చేయాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు వాసెలిన్ వేసుకోవాలి.ఆ తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉంచి మెల్ట్ చేసుకోవాలి.ఇలా మెల్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన అనంతరం ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టార్ట్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని నైట్ నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసుకుని వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకున్నాక నిద్రించాలి.
ఇలా ప్రతి రోజూ చేస్తే కనుక ముఖ చర్మం తేమగా మరియు మృదువుగా మెరుస్తుంది.చర్మ ఛాయ మెరుగుపడుతుంది.చర్మంపై ముడతలు ఏమైనా ఉంటే క్రమంగా దూరం అవుతాయి.ప్రస్తుత చలికాలంలో ఈ చిట్కాను ప్రయత్నిస్తే పొడి చర్మం అన్న మాటే అనరు.