కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పై తన ప్రభావాన్ని చూపుతుంది.
ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో పలు దేశాల్లో కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.కరోనా కారణంగా మరణాల సంఖ్య పక్కన పెడితే ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
నిరుద్యోగి నుండి ఉద్యోగలు వరకూ చాలా మంది ఉపాధి కోల్పోయారు.వివరాల్లోకి వెళితే థాయిలాండ్ దేశంలో టాక్సీ డ్రైవర్లు రోడ్డున పడ్డారు.
కరోనా కారణంగా థాయిలాండ్ లో ఉపాధి కరువైంది దీంతో టాక్సీలు రోడ్డెక్కలేవు.దీంతో చాలావరకు కార్లు పాడైపోయాయి.
డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.పనికి రాకుండా పోయిన కార్లను ఏం చేయాలో తెలియక వాటిని ఓ మైదానంలో వదిలి పెట్టేశారు.
అయితే అలా పాడైన కార్లపై మినీ గార్డెన్స్ ను ఏర్పాటు చేశారు.కార్ల రూఫ్ టాప్ లో పలు రకాల పండ్లు కూరగాయలు మొక్కలు నాటారు.