ప్రపంచంలో మిలియనీర్లు ఎక్కువగా ఉన్న దేశంగా అమెరికా( America ) ఉంటుంది.అమెరికాలో మిలియనీర్ల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది.
అలాగే యూకే,చైనా లాంటి దేశాల్లో కూడా మిలియనీర్ల సంఖ్య బాగానే ఉంది.ఇక ఇండియా విషయానికొస్తే.
మన దేశంలో కూడా మిలియనీర్లు బాగా పెరిగిపోతున్నారు.కానీ తాజాగా ఒక రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి.
ఇండియాలోని మిలియనీర్లు వేరే దేశాలకు వెళుతున్నారట.హెన్లీ ప్రైవేట్ హెల్త్ మైగ్రేషన్ రిపోర్టులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దాదాపు 6,500 మంది మిలియనీర్లు( 6,500 millionaires ) భారత్ నుంచి వెళ్లిపోనున్నట్లు హెన్లీ ప్రైవేట్ హెల్త్ మైగ్రేషన్ ( Henley Private Health Migration )రిపోర్టులో బయటపడింది.భారత్‌లో రక్షణ లేదని చాలామంది సంపన్నులు భావిస్తున్నారట.అందుకే తమ సంపద చేజారకుండా ఉండేందుకు ఇతర దేశాలకు చెక్కేస్తున్నట్లు చెబుతున్నారు.మిలియనీర్లను కోల్పోతున్న దేశాల్లో చైనా తొలి స్థానంలో ఉండగా.ఆ తర్వాత రెండో స్థానంలో భారత్ ఉంది.ఇండియా నుంచి మిలియనీర్లు ఎక్కువగా ఆస్ట్రేలియాకు( Australia ) తరలిపోతున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5,20 మంది మిలియనీర్లు ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లారట.
ఇక 2022లో యూఏఈకి( UAE ) ఎక్కువమంది వెళ్లారు.4,500 మంది ఆ దేశానికి వెళ్లగా.ఈ ఏడాది 3,200 మంది సింగపూర్‌కు వెళ్లేందుకు సిద్దమవుతున్నారట.
ఇక అమెరికాకు 2,100 మంది వెళ్లనుండగా.స్విట్జర్లాండ్, కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చగల్, న్యూజిలాండ్ దేశాలకు కూడా కొంతమంది మిలియనీర్లు మైగ్రేట్ అవుతున్నారు.
ఇక చైనా నుంచి మిలియనీర్లు ఎక్కువగా సింగపూర్‌కు వెళుతున్నారు.కరోనాతో చైనాకు బాగా నష్టం జరిగింది.
దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా చతికిలపడిపోయింది.దీంతో చైనాలో ఉంటే డబ్బులకు సెక్యూరిటీ ఉండదనే కారణంతో వేరే దేశాలకు వలస వెళ్తున్నారు.
సింగపూర్‌లో ట్యాక్స్‌లు కూడా తక్కువగా ఉండటంతో అక్కడకు వెళ్లేందుకు బిలియనీర్లు ఆసక్తి చూపుతున్నారు.