Paul G. Allen Microsoft : మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడి పెయింటింగ్స్‌కు వేలంలో కళ్లు చెదిరే ధర

కొందరికి ఆర్ట్ కలెక్షన్ అంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది.వాటిని సేకరించి, తమ దగ్గర ఉంచుకోవడం చాలా ఇష్టం.

 Microsoft Co Founder Paintings Fetch Eye Popping Prices At Auction , Microsoft,-TeluguStop.com

దివంగత మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు పాల్ G.అలెన్‌కు కూడా ఇదే తరహా ఆసక్తి ఉంది.అయితే ఇటీవల న్యూయార్క్‌లో మొత్తం 155 కళాఖండాలు వేలం వేయగా, వాటికి ఊహించని ధర దక్కింది.ఐదు పెయింటింగ్‌లు $100 మిలియన్లకు పైగా ధరలకు అమ్ముడయ్యాయి.జార్జెస్ సీయూరత్ యొక్క పాయింటిలిస్ట్ పెయింట్ అత్యధికంగా 149.2 మిలియన్ డాలర్లకు విక్రయించబడింది.దీని పెద్ద వెర్షన్ ఫిలడెల్ఫియాలోని బర్న్స్ కలెక్షన్‌లో ఉంది.పాల్ అలెన్ ఆర్ట్ కలెక్షన్‌కు 500 సంవత్సరాల చరిత్ర ఉంది.గత 500ల ఏళ్లలో ఎంతో పేరొందని కళాఖండాలను ఆయన సేకరించుకున్నారు.

క్రిస్టీస్ అనే వేలం సంస్థ పాల్ G.అలెన్‌ ఆర్ట్ కలెక్షన్ ను వేలం వేసింది.సుమారు $1 బిలియన్లకు ఈ పెయింటింగ్‌లు విక్రయించబడతాయని అంచనా వేశారు.2018లో అలెన్ మరణించినప్పుడు అతడి చివరి కోరికగా ఆర్ట్ కలెక్షన్ వేలం వేసి, ఆ మొత్తంతో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ వేశారు.జార్జెస్ సీయురాట్ యొక్క లెస్ పోజ్‌జెస్, సమిష్టి (పెటిట్ వెర్షన్) 1888 ఉంది.

ఇది ముగ్గురు నగ్న మహిళలను ఆయిల్ పెయింట్‌తో చిత్రీకరించారు.ఇది 149.2 మిలియన్ డాలర్ల ధరకు అమ్ముడుపోయింది.రెండవ పెయింటింగ్ 1888-1890 వరకు చిత్రించిన ప్రకృతి దృశ్యం.సెజాన్ యొక్క లా మోంటగ్నే సెయింట్-విక్టోయిర్ పెయింటింగ్ 137.8 మిలియన్లకు విక్రయించబడింది.ఇలా 150 పెయింటింగ్స్‌ను వేలం వేశారు.వాటికి రికార్డు ధర పలకడంతో వేలం సంస్థ ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు.వేలంలో వచ్చిన మొత్తాన్ని త్వరలో సేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube