బొగ్గు కుళ్ళు తెగులు నుండి సోయాబీన్ పంటను సంరక్షించే పద్ధతులు..!

సోయాబీన్ పంట(Soybean Cultivation )ను ఆశించే బొగ్గు కుళ్ళు తెగులు అనేవి మాక్రోఫోమియా ఫేసెయోలియా( Macrophomia phaseolia ) అనే ఫంగస్ వల్ల సోకుతుంది.ఈ ఫంగస్ శీతాకాలంలో పొలంలోని మట్టిలో జీవించే ఉంటుంది.

 Soybean Crop , Pest, Macrophomia Phaseolia  Fungus, Soybean Cultivation, Organic-TeluguStop.com

సీజన్ ప్రారంభంలో వేరు ద్వారా మొక్కలకు సోకుతుంది.వేరు అంతర్గత కణజాలానికి నష్టం కలగడం వల్ల మొక్కలు నీటిని ఎక్కువగా గ్రహించలేవు.

బొగ్గు తెగులు ఫంగస్ యొక్క కార్యకలాపాలు మరియు పెరుగుదలకు పొడి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.
మొక్కలు పుష్పించే సమయంలో వెచ్చని, పొడి వాతావరణంలో ఈ తెగులు పొలంలో గమనించవచ్చు.

తక్కువ శక్తి ఉండే మొక్కలకు అధికంగా ఉష్ణోగ్రత తగిలితే పగటి సమయంలో ఈ తెగుల వల్ల వాలిపోతాయి.వేర్లు మరియు కాండంలోని అంతర్గత కణజాలం ఎరుపు రంగుతో కూడిన గోధుమ రంగుకు పాలిపోవడం జరుగుతుంది.

మొక్కలు ఏ దశలో ఉన్నా కూడా ఈ తెగులు( pest ) పంటను ఆశించే అవకాశం చాలా ఎక్కువ.కాకపోతే మొక్కలు పుష్పించే దశలో సోకితే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబట్టి తెగులు నిరోధక సర్టిఫైడ్ కంపెనీ సోయాబీన్ విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.పొడి మరియు వేడి వాతావరణ సమయంలో కచ్చితంగా పొలానికి నీటి తడి అందించాలి.

వేసవికాలంలో పొలాన్ని బాగా లోతుగా దున్నుకోవాలి.ఈ తెగులు పంటను ఆశించకుండా ఉండాలంటే పంట మార్పిడి చాలా ముఖ్యం.


సేంద్రియ పద్ధతి( Organic method )లో ఈ తెగులు నివారించాలంటే 250 గ్రాముల వెర్మి పోస్ట్ లేదా FYM తో 5కేజీ ను విత్తనం వేసే సమయంలో వాడితే ఈ తెగులు రాకుండా నిరోధించవచ్చు. రసాయన పద్ధతి( Chemical method )లో ఈ తెగులను నివారించుకోవాలంటే.vitavax పవర్ లేదా praarambh లలో ఒకదానిని ఎంపిక చేసుకొని ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారచేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube