మామూలుగా ప్రేమ ఎవరి మధ్య ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరు చెప్పలేరు.అంతేకాకుండా ఒక్కోసారి ఈ ప్రేమకు వయసుతో కూడా పెద్దగా సంబంధం ఉండదు.
దీంతో ఇప్పటికే చాలా మంది వయసు భేదంతో పని లేకుండా పెద్ద వయసు కలిగిన వారు చిన్న వారిని చిన్న వయసు కలిగిన వారు పెద్ద వారిని ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకున్న ఘటనడాలో కూడా చాలానే ఉన్నాయి.కానీ తాజాగా ఓ యువకుడు పెళ్లయిన మహిళకు ప్రేమ లేఖ రాయడంతో జరిమానాతో పాటు ఒక ఏడాది జైలు శిక్ష కూడా విధించిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే మహేష్ (పేరు మార్చాం) అనే యువకుడు ముంబై నగర పరిసర ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా కిరాణా సరుకుల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.
దీంతో స్థానికంగా నివాసం ఉంటున్న కుటుంబాలు సరుకుల నిమిత్తమై తరచూ మహేష్ కిరాణా దుకాణాలు కి వచ్చే వాళ్ళు.ఈ క్రమంలో మహేష్ ఓ పెళ్ళైన మహిళ పై మనసు పడ్డాడు.
దీంతో ఏకంగా తన ప్రేమని వ్యక్తపరిచేందుకు లవ్ లెటర్ కూడా రాశాడు.దీంతో మహిళ తన భర్తతో ఈ విషయం గురించి చెప్పడంతో మహిళ భర్త ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి మహేష్ పై పరువు నష్టం దావా కూడా వేశాడు.
దీంతో కోర్టు మహేష్ కి 40 వేల రూపాయల జరిమానాతో పాటు రెండు సంవత్సరాల శిక్ష కూడా విధించింది.
దీంతో మహేష్ లబోదిబోమంటూ తన తప్పును తెలుసుకొని శిక్ష తగ్గించమని కోర్టుని వేడుకున్నాడు.
దాంతో మహేష్ తప్పు తెలుసుకున్నాడని నమ్మిన కోర్టు జరిమానా ని 90 వేల రూపాయలకు పెంచుతూ ఒక ఏడాది శిక్షను తగ్గించింది.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అంతేకాకుండా ఈ విషయం పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ పెళ్లయిన మహిళలని గౌరవించాలని అంతేగాక ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా మాధ్యమాలలో మరియు బాహ్య ప్రపంచంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అలాంటివారికి బుద్ధి వచ్చేలా కోర్టు సరైన తీర్పు విధించిందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.