మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం పెళ్లి వాతావరణం నెలకొంది.చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం హైదరాబాద్‌కు చెందిన బిజినెస్మెన్ కళ్యాణ్‌తో అంగరంగ వైభవంగా జరుపుతున్న విషయం తెల్సిందే.
శ్రీజకు ఇది రెండవ పెళ్లి అయినా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి వివాహాన్ని బెంగళూరులో చేస్తున్నారు.వేడుకల విషయం అలా ఉంచితే తన మాజీ భర్త శిరీష్ భరద్వాజ్‌ను సైతం శ్రీజ ఈ పెళ్లికి ఆహ్వానించినట్లుగా మెగా వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది
విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజ మరియు శిరీష్‌లు పలు సార్లు కలుసుకోవడం జరిగిందని, వీరిద్దరికి ఒక పాప ఉన్న కారణంగా ఆ పాప కోసం ఇద్దరు కూడా స్నేహితులుగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు అని తెలుస్తోంది.
అందుకే శిరీష్‌ను సైతం ఈ పెళ్లికి శ్రీజ ఆహ్వానించిందని తెలుస్తోంది.అయితే శిరీష్ ఈ పెళ్లికి హాజరు అయ్యేది లేనిది ఇంకా తెలియరాలేదు.
పెళ్లి తర్వాత కూడా ఇద్దరు స్నేహితులుగా ఉంటారని మెగా వర్గాల నుండి సమాచారం అందుతోంది.మరో వైపు శిరీష్ సైతం పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.