'యానిమల్' ఎనిమీ ఎవరో తెలుసా.. విలన్ ను రివీల్ చేసిన మేకర్స్!

బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ”యానిమల్”( Animal ) ఒకటి.ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ ఫ్యాన్స్ లో చాలా మంది ఎదురు చూస్తున్నారు.

 Meet Animal Ka Enemy Bobby Deol's First Look, Bobby Deol, Animal, Sandeep R-TeluguStop.com

ఈ సినిమా కోసం టాలీవుడ్ లో కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే ఈ సినిమాను మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించడం వల్ల ఈ సినిమాపై సౌత్ వారు కూడా ద్రుష్టి పెట్టారు.

తెలుగు డైరెక్టర్ కాబట్టి హిందీ ఆడియెన్స్ తో పాటు తెలుగు ఆడియెన్స్ ను కూడా మెప్పించే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్..అర్జున్ రెడ్డి తర్వాత మొత్తానికి బాలీవుడ్ కు వెళ్ళిపోయినా సందీప్ రెడ్డి ఇప్పుడు యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.‘యానిమల్’ సినిమాలో హీరోగా బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) నటిస్తుండగా హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandanna )నటిస్తుంది.సాలిడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.వాటిని ఇప్పుడు నెక్స్ట్ లెవల్ కు చేర్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే వరుసగా ఒక్కొక్కరి పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.ఇప్పటికే రణబీర్ కపూర్ రోల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది.

ఈయన లుక్ బాగా ఆకట్టుకుంది.

ఇక రెండు రోజుల క్రితం రష్మిక మందన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.అమ్మడి ఫస్ట్ లుక్ ఆమె ఫ్యాన్స్ ను ఫిదా చేసేస్తుంది.సింపుల్ అండ్ హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది.

ఇక హీరోయిన్ ఫస్ట్ లుక్ రివీల్ చేసి అలా రెండు రోజు గడిచిందో లేదో అప్పుడే విలన్ లుక్ ను రివీల్ చేసారు.హు ఈజ్ యానిమల్ ఎనిమి.

అంటూ సోషల్ మీడియా వేదికగా విలన్ ఫస్ట్ లుక్ రివీల్ చేసారు.ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ( Bobby Deol )నటిస్తున్నాడు.

ఈయన పవర్ఫుల్ లుక్ ను రివీల్ చేస్తూ రణబీర్ కపూర్ విలన్ ఎవరో రివీల్ చేసాడు.ఈ సినిమాలో రణబీర్, బాబీ డియోల్ మధ్య వార్ మాములుగా ఉండదట.

డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube