ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని సైతం మోసం చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.కాగా తాజాగా ఓ వివాహిత బరువు తగ్గేందుకు జిమ్ కి వెళ్లి జిమ్ ట్రైనర్ తో లవ్ లో పడటంతో మహిళ భర్త జిమ్ ట్రైనర్ పై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని పాట్నా పరిసర ప్రాంతంలో “కుష్బూ సింగ్” అనే వివాహిత తన భర్తతో కలిసి నివాసముంటోంది.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ విధించడంతో కుష్బూ సింగ్ గత కొద్ది కాలంగా ఎలాంటి పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది.
ఈ క్రమంలో కొంత మేర బరువు పెరిగింది.దీంతో ఈ విషయం తన భర్తకు తెలియజేయడంతో దగ్గరలో ఉన్నటువంటి జిమ్ లో చేరి బరువు తగ్గేందుకు ప్రయత్నించాలని సలహా ఇచ్చాడు.
దీంతో కుష్బూ సింగ్ తన భర్త చెప్పినట్టు దగ్గరలో ఉన్నటువంటి లో బరువు తగ్గేందుకు జాయిన్ అయ్యింది.ఇక్కడి వరకు బాగానే ఉంది.
అయితే మొదట్లో కుష్బూ సింగ్ కి జిమ్ లోని పరికరాలు ఎలా ఉపయోగించాలనే విషయాలను తెలియజేస్తూ జిమ్ ట్రైనర్ అయిన విక్రమ్ తో పరిచయం ఏర్పడింది.దీంతో ఈ పరిచయం కాస్త అతికొద్ది సమయంలోనే ప్రేమగా మారింది.దీంతో కుష్బూ సింగ్ తన భర్త లేనప్పుడు తన ప్రియుడైన పిలిపించుకుని ఎంజాయ్ చేసేది.ఈ క్రమంలో వీరిద్దరి వ్యవహారం కుష్బూ భర్త కి తెలిసింది.దీంతో మరోమారు తామిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఇద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కుష్బూ భర్త..
అయినప్పటికీ కుష్బూ సింగ్ తన భర్త మాటలను పెడచెవిన పెట్టింది.దాంతో కుష్బూ భర్త కిరాయి గుండాలను పిలిపించి విక్రమ్ పై కాల్పులు జరిపించాడు.
కానీ విక్రమ్ అదృష్టం బాగుండడంతో స్థానికులు కాల్పుల శబ్దం విని విక్రమ్ ని దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.అనంతరం విక్రమ్ తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.