ప్రస్తుత కాలంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇంతటి క్రూరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా అనే సందేహం కలగక మానదు. తాజాగా ఓ మహిళ తన కన్న కొడుకు కోరిక తీర్చడం కోసం అభం శుభం తెలియని ఓ మైనర్ బాలిక పై అత్యాచారం చేయించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే స్థానిక గుంటూరు పట్టణ పరిసర ప్రాంతంలో గోపీనాథ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే ఇతడు గత కొద్ది కాలంగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఓ మైనర్ బాలిక పై కన్నేశాడు.
ఈ మైనర్ బాలిక స్థానికంగా ఉన్నటువంటి ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.దీంతో బాలిక పాఠశాల కి వెళ్లి వచ్చే క్రమంలో ఆమె వెంట పడేవాడు.
అయితే తాజాగా ఈ విషయం గురించి తన తల్లికి చెప్పడంతో మందలించాల్సిన కన్న తల్లి ఏకంగా తన కొడుకు కోరిక తీర్చేందుకు మైనర్ బాలిక ఇంటికి పిలిపించి బలవంతంగా గదిలోకి పంపి తన కొడుకు చేత అత్యాచారం చేయించింది.అయితే ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులను చేరుకొని తన పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి తన కుటుంబ సభ్యులకు తెలిపింది.
దీంతో వెంటనే బాలికను వెంటబెట్టుకొని బాధితురాలి తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగినటువంటి పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ విషయంపై స్పందించిన కొందరు స్థానికులు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించినటువంటి ఆ మహిళ కి కఠిన శిక్ష విధించాలని పోలీసులను కోరుతున్నారు.