తెలుగు చిత్ర పరిశ్రమలు ఎంతోమంది హీరోలు స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఇలా ఇండస్ట్రీలో ఈయన అంచలంచెలుగా ఎదుగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి చిరంజీవి ( Chiranjeevi ) తన కుటుంబ సభ్యులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఈ క్రమంలోనే నాగబాబు పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో కొనసాగారు.అయితే మెగా వారసులుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగాను అలాగే వారసురాళ్లు నిర్మాతలుగాను కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా మెగా వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ramcharan Tej ) ఒకరు.ఈయన హీరోగా ఇండస్ట్రీలో తండ్రికి మించిన తనయుడుగా గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన ( Upasana ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బిజినెస్ రంగంలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను కూడా చూసుకుంటూ ఉన్నారు అలాగే ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ మెగా ఇంటి పరువు ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు చేర్చారు.
ఇక చిన్నప్పటినుంచి సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేనటువంటి ఉపాసన కేవలం ఒక హీరో సినిమాలను మాత్రమే చూసేదట.ఇక మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టినప్పటికీ కూడా ఈమె ఫ్యామిలీలో అంత మంది హీరోలు ఉన్న ఒక హీరో సినిమాలు మాత్రమే ఎక్కువగా చూస్తుందని తెలుస్తుంది.మెగా కుటుంబం నుంచి రాంచరణ్ అల్లు అర్జున్( Allu Arjun ) పవన్ కళ్యాణ్ వంటి ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ పెద్దగా ఇష్టపడేవారు కాదని తెలుస్తుంది.మరి ఉపాసనకు అంత ఇష్టమైనటువంటి హీరో ఎవరు అనే విషయానికి వస్తే…
ఇంట్లో ఎంతో మంది టాలెంట్ కలిగినటువంటి హీరోల సినిమాలనుకాదని ఈమె విక్టరీ వెంకటేష్( Venkatesh ) సినిమాలంటే చాలా ఇష్టంగా చూస్తారట.ఈయన సినిమాలన్నీ కూడా ఎక్కువగా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఈయన నటన కానీ సినిమాలు కానీ ఉపాసనకు విపరీతంగా నచ్చడంతో వెంకటేష్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారట ఇప్పటికీ కూడా వెంకటేష్ సినిమాలను చూస్తూ ఉంటారని తెలుస్తోంది.ఇక ఈ విషయం వైరల్ గా మారడంతో కొందరు అంతమంది మెగా హీరోలు చేసే నటన ఉపాసన గారికి నచ్చలేదా అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఎవరి అభిరుచి వారిది ఇంట్లో హీరోలు ఉంటే వారి సినిమాలను ఇష్టపడాలని రూల్ ఏం లేదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.