బ్రిటన్ రాయల్ ఖజానాలో భారతీయ సంపద.. వెలుగులోకి మహారాజా రంజిత్ సింగ్ ఆభరణాల చిట్టా

భారత్‌లో బ్రిటీష్ పాలన, దోపిడికి సంబంధించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు.200 ఏళ్లు భారతదేశాన్ని పాలించిన ఆంగ్లేయులు మనదేశం నుంచి విలువైన సంపదను, రత్నరాసులను, కళాఖండాలను( Indian jewels ) దోచుకెళ్లారు.ఇదంతా ఇప్పుడు బ్రిటీష్ మ్యూజియాల్లో, రాయల్ ప్యాలెస్‌లలో మగ్గుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇండియా ఆఫీస్ ఆర్కైవ్స్ కీలక విషయాలు వెలుగులోకి తెచ్చింది.‘‘కాస్ట్ ఆఫ్ ది క్రౌన్’’( Cost Of The Crown ) సిరీస్‌లో భాగంగా మే 6న జరగనున్న కింగ్ ఛార్లెస్ III పట్టాభిషేకానికి( King Charles III ) ముందు బ్రిటన్ రాజ సంపద, ఆర్ధిక విషయాలపై పరిశోధనను ది గార్డియన్ వార్తాపత్రిక వివరించింది.

 Many Indian Jewels In Uk Royal Treasury Traced Back To Punjab Ruler Maharaja Ran-TeluguStop.com

ఈ వారం విడుదల చేసిన నివేదికలలో 46 పేజీల ఫైల్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఇది క్వీన్ మేరీ (దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 నానమ్మ) పరిపాలనా కాలానికి సంబంధించినది.ఇందులో పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్( Maharaja Ranjit Singh ) తన గుర్రపుశాలలో గుర్రాలను అలంకరించేందుకు ఉపయోగించిన పచ్చలు పొదిగిన బంగారు నడికట్లు వుంది.

ఇది ఇప్పుడు కింగ్ చార్లెస్ రాయల్ కలెక్షన్‌లో భాగం.దీనితో పాటు ఎన్నో విలువైన సంపదను ట్రోఫీలుగా విక్టోరియా మహారాణికి అందించారని నివేదికలో పేర్కొన్నారు.

Telugu Cost Crown, Duleep Singh, Indian Jewels, Indian Treasury, Charles Iii, Pu

అలాగే 1837లో బ్రిటీష్ సొసైటీ డైరిస్ట్ ఫానీ ఈడెన్, ఆమె సోదరుడు జార్జ్, అప్పటి బ్రిటన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాలు రంజిత్ సింగ్ దర్బార్‌ను సందర్శించిన వివరాలు కూడా వున్నాయి.ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్‌షిప్‌లో భాగంగా ఆంగ్లేయులు పంజాబ్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా రంజిత్ సింగ్ సంపదను చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయినట్లు ఈడెన్ రాశాడు.ఏకంగా గుర్రాలపైనా విలువైనా ఆభరణాలను రంజిత్ సింగ్ వుంచాడని ఈడెన్ ప్రస్తావించారు.

తర్వాత 19వ శతాబ్ధంలో రంజిత్ సింగ్ కుమారుడు దులీప్ సింగ్ పంజాబ్‌పై ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ సంతకం చేయాల్సి వచ్చింది.

Telugu Cost Crown, Duleep Singh, Indian Jewels, Indian Treasury, Charles Iii, Pu

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం ఈస్టిండియా కంపెనీ అధికారుల దోపిడీ ఫలితంగానే అది విక్టోరియా రాణి ఆధీనంలోకి వచ్చిందని చారిత్రకారులు చెబుతారు.మే 6న క్వీన్ కెమెల్లా పట్టాభిషేకానికి సాంప్రదాయబద్ధంగా కోహినూర్‌ను పొదిగిన కిరీటాన్ని ఎంచుకోకపోవడం ద్వారా దౌత్యపరమైన వివాదాన్ని నివారించినప్పటికీ.వలస రాజ్యాల కాలం నాటి ఆభరణాలపై మాత్రం దృష్టి సారించింది.

బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.బానిసత్వం, వలసవాదం కింగ్ చార్లెస్ III తీవ్రంగా పరిగణించే విషయాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube