మంచు మనోజ్( Manchu Manoj ) ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలు నిలుస్తున్నారు.అయితే ఈయన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం గడిచిపోయింది.
ప్రస్తుతం ఈయన అహం బ్రహ్మాస్మి,వాట్ ది ఫిష్ అనే సినిమాలలో నటిస్తూ ఉన్నారు.అయితే ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అనే అప్డేట్స్ మాత్రం వెలబడలేదు.
ఇలా సినిమాల పరంగా కాకపోయినా మంచు మనోజ్ తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని ( Bhuma Mounika Reddy ) వివాహం చేసుకోవడంతో ఈయన వార్తలలో నిలిచారు.
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు.
ఇలా కొత్త జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నటువంటి మనోజ్ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇకపోతే తాజాగా మనోజ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుత కాలంలో ఓటీటీ( Ott ) లకు ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.
ఓటీటీ వేదికగా ఎన్నో వెబ్ సిరీస్లో కార్యక్రమాలు టాక్ షోలు ప్రచారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే మంచు మనోజ్ సైతం ఓటీటీలో ప్రసారం కాబోయే ఒక టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విధంగా ,ఓటీటీలలో ప్రసారమయ్యే టాక్ షోలకు సమంత, రానా బాలకృష్ణ, మంచు లక్ష్మి వంటి వారందరూ కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ టాక్ షోలను ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు.ఈ క్రమంలోనే మంచు మనోజ్ సైతం ఒక టాక్ షో( Talk Show ) కి హోస్ట్ ( Host ) గా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది.ఇక ఈయన చేయబోయే ఈ టాక్ షోని బ్రో నిర్మాతలు( Bro Movie Producers ) నిర్మించబోతున్నట్లు సమాచారం.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సారధ్యంలో ఈ టాక్ షో ప్రసారం కాబోతున్నట్టు సమాచారం.
అయితే త్వరలోనే ఈ టాక్ షో ఏంటి ఏ ఓటీటీలో ఇది ప్రసారం కాబోతోందనే విషయాల గురించి అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.