జాడీలో ఇరుక్కుపోయిన వ్యక్తి.. హిలేరియస్ వీడియో వైరల్..

కొంతమంది అనవసరంగా వారంతట వారే ఇబ్బందుల్లో పడుతుంటారు.ముఖ్యంగా మందుబాబులు మత్తెక్కి ఏం చేస్తున్నామో తెలియక ప్రమాదాల్లో పడుతుంటారు.

 Man Gets Stuck In Vase During Party Hilarious Video Viral Details, Viral News, V-TeluguStop.com

తాజాగా ఓ మందు బాబు పెద్ద కుండీలో చిక్కుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో 15 మిలియన్లకు పైగా ప్రజలు దీనిని చూశారు.

వీడియోలో ఓ వ్యక్తి జాడీ లోపల ఇరుక్కున్నట్లు మనం చూడవచ్చు.అతడి పేరు కానర్ పాడ్జెట్.

( Connor Padgett )

జాడీ లోపల కాళ్లు ఇరుక్కోవడంతో అతడు బయటికి రాలేక నేలపై డోర్లతూ చాలా కోపాన్ని వ్యక్తపరిచాడు.అతడిని చూసి స్నేహితులు తెగ నవ్వేసుకున్నారు.

అందులోకి ఎందుకు వెళ్లావు రా అంటూ కొంతమంది సరదాగా అతడిని ఏడిపించారు.మరి కొంతమందిని అతడిని జాడీ నుంచి బయటికి విడిపించేందుకు ప్రయత్నించడం మనం వీడియోలో చూడవచ్చు.

డైలీ మెయిల్ వార్తాపత్రిక, పాడ్జెట్ అలబామాలోని( Alabama ) బర్మింగ్‌హామ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ అని నివేదించింది.

అతను నూతన సంవత్సర పండుగ( New Year Festival ) సందర్భంగా మౌంటెన్ బ్రూక్( Mountain Brook ) వద్ద ఒక పార్టీకి వెళ్ళాడు.అక్కడ ఎలాగోలా జాడీ లోపలికి వెళ్లాడు కానీ బయటకు రాలేకపోయాడు.అతను తప్పించుకోవడానికి పోరాడుతున్న కొద్దీ మరింత భయపడ్డాడు.

పాడ్జెట్ పరిస్థితి వీడియోను పార్టీలో ఉన్న ఒకరు ఆన్‌లైన్‌లో పంచుకున్నారు.“మౌంటెన్ బ్రూక్‌లోని పార్టీలో ఒక వ్యక్తి పెద్ద కుండీలో ఇరుక్కుపోయాడు.అతను మద్యం తాగి బయటకు రాలేడు.” అని ఈ వీడియోకి క్యాప్షన్ జోడించారు.

“మొదట్లో సరదాగా మాట్లాడాడు, కానీ తర్వాత కోపంగా ఉన్నాడు.మహిళలు అతడిని కూల్ చేయడానికి ట్రై చేస్తున్నారు.వారు జాడీని పగలగొట్టాలని ఆలోచిస్తున్నారు.” అని ఒకరు కామెంట్ చేశారు.పాడ్జెట్ ఎందుకు జాడీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడో ఎవరికీ తెలియదు.బహుశా అతను ఫన్నీ ట్రిక్( Funny Trick ) చేయాలనుకున్నాడు కానీ అది తప్పు అయింది.చివరగా, ఎవరో సుత్తిని తెచ్చి, జాడీని పగులగొట్టారు.ప్యాడ్జెట్ విముక్తి పొందాడు, అతను సంతోషంగా కనిపించాడు.

జాడీ ముక్కలతో ఫొటోలు తీశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube