ప్రేమలు సినిమా( Premalu Movie ) విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాలో నటించిన హీరోయిన్ పైనే ఉంది.ఈ అమ్మడు కేరళ బ్యూటీ మమిత భైజు.
( Mamitha Baiju ) ప్రేమలు సినిమా ఇంత హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో నటించిన మమిత అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆ అమ్మాయి క్యూట్ లుక్స్ అలాగే హెయిర్ స్టైల్ తో పాటు నటన కూడా అద్భుతంగా ఉన్నాయి.
చాలామంది టాలీవుడ్ లో మమిత మరో సాయిపల్లవి అవుతుందని అనుకుంటున్నారు.ఇక మమిత సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది.
దాదాపు 2017 లోనే ఆమె మొట్టమొదటిసారిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం ఈ అమ్మడుకు ప్రేమలు సినిమా తర్వాత గట్టి బ్రేక్ వచ్చింది అనుకోవచ్చు.
ఇక తెలుగు వారందరూ కూడా మమిత లుక్స్ కి ఫిదా అయిపోతున్నారు.ఈమె ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అయితే ఆమె ఈ సినిమాలో కనిపించిన లుక్ పై అందరి కన్ను పడింది.చాలామంది మమిత లుక్స్ చాలా క్యూట్ గా ఉన్నాయని అందుకు ఆమె హెయిర్ స్టైల్( Mamitha Baiju Hair Style ) కూడా చాలా హెల్ప్ అయిందని ప్రస్తుతం కొంతమంది యువత ఆమె హెయిర్ స్టైల్ ఫాలో కూడా అవుతున్నారట.
మరి ఇంత మంచి హెయిర్ స్టైల్ వెనక ఒక స్టోరీ కూడా ఉందట.ప్రేమలు సినిమా డైరెక్టర్ గిరీష్ అంతకన్నా ముందు తను తీసిన సూపర్ శరణ్య( Super Sharanya ) అనే ఒక సినిమాలో కూడా మమిత నటించిందట.
ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో చిత్రంలో ఉన్న లుక్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము అని ఆమె అలాంటి హెయిర్ బ్యాంగ్స్ ట్రై చేసిందట.
అక్కడ ఆమె లుక్ చూసి డైరెక్టర్ గిరీష్( Director Gireesh ) ఫిదా అయిపోయారట.ఇక ప్రేమలు సినిమా కోసం హీరోయిన్ ని చూస్తున్న సమయంలో కూల్ లుక్స్ లో ఉన్న మమిత అనే గుర్తొచ్చి అదే హెయిర్ స్టైల్ తో ఒకసారి వచ్చి ఆడిషన్ ఇవ్వాలి చెప్పారట.అలా ఆమె సొంతంగా తనకు తానుగా సరదాగా ట్రై చేసిన హెయిర్ స్టైల్ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా ఎంటర్ సౌత్ ఇండియాలో ట్రెండింగ్ లో ఉండడం విశేషం.
ఒక్కోసారి చిన్నచిన్న ఐడియాస్ ఇంత పెద్ద విజయానికి కారణం అవుతూ ఉంటాయి.అందుకు ప్రేమలు సినిమాలో మమిత హెయిర్ స్టైల్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.