సుకుమార్ శిష్యరికంలో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో డైరెక్టర్స్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు.తన దగ్గర పని చేసిన వారందరికి కూడా ఒక దారి చూపించే మార్గదర్శకుడిగా సుకుమార్( Sukumar ) ఇండస్ట్రీలోనే మంచి పేరు సంపాదించుకున్నారు.
చాలామంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు కానీ వారి అసిస్టెంట్స్ ఎప్పుడూ డైరెక్టర్ గా ఇంత గొప్ప స్థాయిలో ఎవరి ఎవరూ లేరు.కానీ సుకుమార్ విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
తన అసిస్టెంట్ డైరెక్టర్స్ అంతా ఏదో ఒక రోజు గొప్ప డైరెక్టర్స్ గా మారిపోతారు.అందుకు సుకుమార్ సలహాలు, సూచనలుతో పాటు ఆయన ఇచ్చే ప్రోత్సాహం, ఉత్సాహం కూడా అలాగే ఉంటుంది.
![Telugu Ar Rahman, Buchi Babu, Buchibabu, Sukumar, Janhvi Kapoor, Ram Charan, Shi Telugu Ar Rahman, Buchi Babu, Buchibabu, Sukumar, Janhvi Kapoor, Ram Charan, Shi](https://telugustop.com/wp-content/uploads/2024/04/why-sukumar-supports-bucchi-babu-detailss.jpg)
తన దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా మంచి కథ సిద్ధం చేసుకుంటే దానికి కావలసిన స్క్రీన్ ప్లే తో పాటు, స్టార్ హీరో ని, మిగతా టెక్నీషియన్స్ అన్నీ కూడా సుకుమార్ దగ్గరుండి చూసుకుంటారు.ఉదాహరణకు బుచ్చిబాబు( Buchibabu ) మొదటి సినిమాకే విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) లాంటి ఒక సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ని విలన్ పాత్రలో దింపాలి అనుకుంటే అందుకు సుకుమార్ ఎంతో సహాయం చేశారు.అలాగే రెండవ సినిమానే రామ్ చరణ్ తో( Ram Charan ) చేయాలని కంకణం కట్టుకున్న బుచ్చిబాబును చూసి వాడి కలలు ఎప్పుడూ గొప్ప స్థాయిలో ఉంటాయి.అందుకే మంచి సినిమాలు తీయడానికి కంకణం కట్టుకున్నాడు.
అప్పుడు ఉప్పెన( Uppena ) ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా ఉదాహరణలు అని సుకుమార్ చెప్తున్నారు.
![Telugu Ar Rahman, Buchi Babu, Buchibabu, Sukumar, Janhvi Kapoor, Ram Charan, Shi Telugu Ar Rahman, Buchi Babu, Buchibabu, Sukumar, Janhvi Kapoor, Ram Charan, Shi](https://telugustop.com/wp-content/uploads/2024/04/why-sukumar-supports-bucchi-babu-detailsd.jpg)
ఇక సుకుమార్ రాంచరణ్ తో పాటు ఈ సినిమా రెండవ సినిమాకి ఏఆర్ రెహమాన్( AR Rahman ) లాంటి ఒక ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడిని కూడా ఇచ్చాడు.అలాగే సౌత్ ఇండియా లో కాకుండా నార్త్ ఇండియా నుంచి జాన్వి కపూర్ ని( Janhvi Kapoor ) కూడా హీరోయిన్ గా పెట్టాడు.ఇక చిన్న కామియో రోల్ కోసం కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ని కూడా ఏర్పాటు చేశాడు.
ఇవన్నీ చేయడానికి ముఖ్య కారణం బుచ్చిబాబు రాసుకున్న స్క్రిప్ట్ అని అంటాడు సుకుమార్.మంచి కథ రాసుకుంటాడు దాన్ని ఎవరికి కావాలో వారికి కేవలం అపాయింట్మెంట్ మాత్రమే ఇప్పిస్తాను.
బుచ్చిబాబు వెళ్లి కథ చెప్పి ఒప్పించుకుంటాడు.అందుకే వాడు గొప్పవాడు అవుతాడు అంట చెబుతున్నారు.