సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసిన విషయం తెలిసిందే.వారు ఇచ్చే భారీ పారితోషికం తో సదరు చానల్ కి భారీగా పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాడు.
మహేష్ బాబు ఇప్పటికే తన కూతురు సితారతో కలిసి ఒక డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొని ఆ డ్యాన్స్ కార్యక్రమము యొక్క రేటింగ్ అమాంతం పెంచేసిన విషయం తెలిసిందే.ఇక ఛానల్ లో ప్రసారం కాబోతున్న కొత్త సీరియల్స్ కి సంబంధించిన ప్రోమోల్లో కూడా మహేష్ బాబు కనిపిస్తూ పోస్టర్ల మీద మహేష్ బాబు కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
సీరియల్స్ తప్పకుండా బాగుంటాయి అన్నట్లుగా మహేష్ బాబు నమ్మకం కలిగిస్తూ మాట్లాడుతున్నట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.మొత్తానికి జీ తెలుగుని సాధ్యమైనంత ఎక్కువగా మహేష్ బాబు ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు, అందులో భాగంగానే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ కార్యక్రమంలో మహేష్ బాబు పాల్గొనేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రతి సంవత్సరం జీ తెలుగు చానల్లో ప్రసారం అయ్యే సీరియల్స్ కి సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది.ఈసారి ఆ అవార్డు ఫంక్షన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఉత్తమ సీరియల్, ఉత్తమ నటుడు, ఉత్తమ యాంకర్, ఉత్తమ నటి కేటగిరీలో ఎంపికైన వారికి మహేష్ బాబు చేతుల మీదుగా షీల్డ్ అందిస్తారట.మొత్తానికి మహేష్ బాబు ను జీ తెలుగు వారు సాధ్యమైనంతగా వాడేసుకుంటున్నారు.
అందుకు ఆయన కూడా భారీగానే పారితోషికం దక్కించుకున్నాడు అది వేరే విషయం.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది.
ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.