మహర్షి రన్ టైం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా మహర్షి.పూజా హెగ్డే ఇందులో మహేష్ కి జోడీగా కనిపించనుండగా, మరో కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు.

 Maharshi Movie Run Time Is Hot Topic In Tollywood-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి.అయితే సినిమా కొద్దిగా శ్రీమంతుడు చాయలు ఉన్నాయనే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి.

ఈ సినిమాలో మహేశ్ ఓ ఐటీ కంపెనీ సిఈఓగా కనిపిస్తాడని, తరువాత ఫ్రెండ్ కోసం ఇండియా వచ్చి ఏం చేస్తాడు అనే ఎలిమెంట్స్ తో కథనం నడుస్తుంది అని టాక్ వినిపిస్తుంది

ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పటికే రెడీ అయిపొయింది.రెండు రోజుల క్రితం దర్శకుడు ఫైనల్ అవుట్ పుట్ రెడీ చేసినట్లు తెలుస్తుంది.

తాజాగా ఈ సినిమా రన్ టైం గురించి ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఈ సినిమా నిడివి ఏకంగా 170 నిమషాలు ఉందని సమాచారం.

అంటే సినిమా నిడివి ఏకంగా రెండు గంటల రెండు నలభై నిమషాలు ఉంటుంది.ఓ విధంగా చెప్పాలంటే మహేష్ కెరియర్ లో ఇది చాలా ఎక్కువ నిడివి ఉన్న చిత్రం.

గతంలో బ్రహ్మోత్సవం కూడా ఇంతే నిడివితో వచ్చి మహేష్ కెరియర్ లో డిజాస్టర్ గా మారింది.ఈ నేపధ్యంలో ఈ సినిమా మీద కూడా ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube