అమెరికాలో నాట్స్ ముగ్గుల పోటీ...!!!

సొంత ఊళ్ళని విడిచి ఖండాంతరాలు వివిధ దేశాలలో స్థిరపడిన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నాసరే తెలుగు సంస్కృతిని సాంప్రదాయలని మాత్రం మర్చిపోరు.తమకి దొరికే కొద్ది పాటి తీరిక సమయాలని తెలుగువారందరూ కలిసి ఎదో ఒక రూపంలో మన సంస్కృతిని బ్రతికించుకునేలా, తమ పిల్లలకి సాంప్రదాయాలు తెలుసుకునేలా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు.

 America Nats-TeluguStop.com

అందులో భాగంగానే.

అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో తెలుగు ఆడపడుచులు ముగ్గుల పోటీలలో తమ కళాత్మకతని చూపెట్టారు.

మే నెలలో డాలస్ వేదికగా జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాకంగా ముందస్తుగానే ఈ పోటీలని నిర్వహిస్తూ వస్తోంది నాట్స్.దాంతో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తూ వస్తోంది.

అయితే ఈ పోటీలలో చాలా మంది మహిళలు తమ సృజనాత్మకతనని చూపించారు.నాట్స్ నినాదమయిన ‘భాషే రమ్యం సేవే గమ్యం’ కి దగ్గరగా ఉండే ఓ ముగ్గుని పరిశీలించిన ఎంపిక బృందం ఆ ముగ్గు వేసిన ఆలూరు గాయత్రి కి మొదటి బహుమతిని అందించింది.

అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రతిబింబిస్తూ వేసిన మరొక ముగ్గుకి రెండవ బహుమతి దక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube