మహర్షి రన్ టైం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా మహర్షి.

పూజా హెగ్డే ఇందులో మహేష్ కి జోడీగా కనిపించనుండగా, మరో కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి.

అయితే సినిమా కొద్దిగా శ్రీమంతుడు చాయలు ఉన్నాయనే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి.ఈ సినిమాలో మహేశ్ ఓ ఐటీ కంపెనీ సిఈఓగా కనిపిస్తాడని, తరువాత ఫ్రెండ్ కోసం ఇండియా వచ్చి ఏం చేస్తాడు అనే ఎలిమెంట్స్ తో కథనం నడుస్తుంది అని టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పటికే రెడీ అయిపొయింది.

రెండు రోజుల క్రితం దర్శకుడు ఫైనల్ అవుట్ పుట్ రెడీ చేసినట్లు తెలుస్తుంది.

తాజాగా ఈ సినిమా రన్ టైం గురించి ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఈ సినిమా నిడివి ఏకంగా 170 నిమషాలు ఉందని సమాచారం.

అంటే సినిమా నిడివి ఏకంగా రెండు గంటల రెండు నలభై నిమషాలు ఉంటుంది.

ఓ విధంగా చెప్పాలంటే మహేష్ కెరియర్ లో ఇది చాలా ఎక్కువ నిడివి ఉన్న చిత్రం.

గతంలో బ్రహ్మోత్సవం కూడా ఇంతే నిడివితో వచ్చి మహేష్ కెరియర్ లో డిజాస్టర్ గా మారింది.

ఈ నేపధ్యంలో ఈ సినిమా మీద కూడా ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

1940ల నాటి చిరిగిన స్వెట్‌షర్ట్‌ అమ్మకానికి.. ధర వింటే కళ్లు తేలేస్తారు!